Telangana: బీజేపీ నేతలకు కీలక పదవులు..?

Telangana: బీజేపీ నేతలకు కీలక పదవులు..?
X
తెలంగాణ బీజేపీ నేతలకు కీలక పదవులు దక్కే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం.. రాష్ట్ర బీజేపీ నేతల్ని ఢిల్లీకి పిలిచినట్లు తెలుస్తోంది

తెలంగాణ బీజేపీ నేతలకు కీలక పదవులు దక్కే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం.. రాష్ట్ర బీజేపీ నేతల్ని ఢిల్లీకి పిలిచినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే బీజేపీ నేతలు హస్తినకు వెళ్లనున్నారు. రాష్ట్ర పార్టీలో నెలకొన్న తాజా పరిస్థితులపై బీజేపీ అగ్రనాయకత్వం చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. అలర్టైన అగ్రనేతలు రాష్ట్ర ముఖ్యనేతలకు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల టీంను సిద్దం చేయడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. అందుకే అగ్రనేతల తెలంగాణ పర్యటనకు ముందే... రాష్ట్ర నేతల్ని ఢిల్లీకి పిలవడంపై బీజేపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Tags

Next Story