Mla Rajasingh: తృటిలో తప్పించుకున్నాం..భయానక దృశ్యం గురించి రాజాసింగ్..!

అమర్నాథ్ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. మిలటరీ అధికారుల సేవల వల్లే తాను, తన కుటుంబం శ్రీనగర్ ప్రాంతానికి చేరుకున్నామని చెప్పారు. తామున్న ప్రదేశానికి కేవలం కిలోమీటర్ దూరంలోనే వరదలు ముంచెత్తాయన్నారు. మిలిటరీ అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రాణానష్టం ఎక్కువ జరగకుండా చర్యలు చేపడుతున్నారని రాజాసింగ్ తెలిపారు.
ఈ నెల 6న రాజాసింగ్ తన కుమార్తె, అల్లుడితోపాటు 11 మంది కుటుంబ సభ్యులతో కలిసి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లారు. ఢిల్లీ నుంచి హెలికాప్టర్‌లో అమర్‌నాథ్ వెళ్లాలని తొలుత అనుకున్నా వాతావరణం అనుకూలించకపోవడంతో అతి కష్టం మీద గురువారం సాయంత్రం పంచతరణికి చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అమర్‌నాథ్‌లో దర్శనం తర్వాత అరకిలోమీటరు దూరం వరకు వెనక్కి నడిచి వచ్చారు. సరిగ్గా అదే సమయంలో పెద్ద శబ్దంతో వరద దూసుకొస్తూ కనిపించిందని, భక్తులు భయంతో కేకలు వేస్తూ పరుగులు పెట్టారని ఆ భయానక దృశ్యం గురించి రాజాసింగ్ చెప్పారు. అదృష్టవశాత్తు సమయానికి గుర్రాలు దొరకడంతో వాటిపై కిందికి బయలుదేరామని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com