BJP vs Revanth Reddy : రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలనుకుంటున్న బీజేపీ..

BJP vs Revanth Reddy : కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్‌లో సంక్షోభాన్ని అనుకూలంగా మలుచుకుంటున్న బీజేపీ...
పీసీసీ చీఫ్ రేవంత్ టార్గెట్‌గా రాజకీయం నడుపుతోంది. రేవంత్‌ను డిఫెన్స్‌లో పడేసి.. కాంగ్రెస్‌ను కట్టడి చేసేలా ప్లాన్ వేసింది. రేవంత్ రాకతో క్యాడర్‌లో జోష్, చేరికల్లో భేష్ అన్నట్లుగా కాంగ్రెస్ జోరు మీదుంది. రేవంత్ మేనియా బీజేపీ ఢిల్లీ పెద్దల్ని తాకినట్లు సమాచారం. రేవంత్ ఒక్కడిని టార్గెట్ చేస్తే... ఇక కాంగ్రెస్‌లో మాట్లాడేవారే ఉండరనే అంచనాకు వచ్చిన బీజేపీ అధిష్టానం ఆదిశగా రాష్ట్ర నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎపిసోడ్ కమలం నేతలకు వరంలా మారింది. పక్కా ప్లాన్ ప్రకారమే రేవంత్‌రెడ్డిపై మూకుమ్మడి దాడికి దిగుతున్నారు బీజేపీ లీడర్లు.
అటు రేవంత్‌రెడ్డి తెలంగాణ చంద్రబాబు అంటూ కొత్త ప్రచారానికి తెరలేపారు కమలం నేతలు. కాంగ్రెస్‌ను విమర్శించిన పాత వీడియోలను చూపిస్తూ విమర్శలకు దిగుతున్నారు. రేవంత్ ఓ బ్లాక్ మెయిలర్ అంటూ విరుచుకుపడుతున్నారు.
అటు రాజగోపాల్ రెడ్డి రాజీనామా అంశం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రెడ్డిల మధ్య చిచ్చు పెట్టింది. బీజేపీ, టీఆర్ఎస్‌లపై ఐక్యంగా పోరాడుతామంటూ రేవంత్ ప్రకటన చేసి 24 గంటలు గడవక ముందే హస్తంపార్టీలో మరో పంచాయతీ మొదలైంది. రాజగోపాల్ రెడ్డి చేసిన విమర్శలను తప్పుపడుతూ రేవంత్ చేసిన వ్యాఖ్యల్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఖండించారు. కాంగ్రెస్ బ్రాండ్ లేకుంటే కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాందీ షాపులు పెట్టుకునే వాళ్లన్న రేవంత్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను రెచ్చగొట్టొద్దని హెచ్చరించిన వెంకట్ రెడ్డి.. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మరి ఈ వ్యూహంలో రేవంత్ చిక్కుతారా..? లేక ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తారా వేచి చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com