Telangana: పెట్రోల్ కోసం పక్క రాష్ట్రానికి వెళ్తున్న సరిహద్దు జిల్లాల వాసులు..

Telangana: పెట్రోల్ కోసం పక్క రాష్ట్రానికి వెళ్తున్న సరిహద్దు జిల్లాల వాసులు..
Telangana: జనం లేక ఈగలు తోలుకుంటున్నారు అంటూ ఉంటాం కదా.. ఈ పెట్రోల్‌ బంకులో అదే జరుగుతోంది.

Telangana: జనం లేక ఈగలు తోలుకుంటున్నారు అంటూ ఉంటాం కదా.. ఈ పెట్రోల్‌ బంకులో అదే జరుగుతోంది.. కస్టమర్లు లేక వీళ్లు ఇదే పని చేస్తున్నారు.. ఒకళ్లిద్దరు వస్తే అదే మహా భాగ్యమని, దేవుళ్లు వచ్చారని ఫీలవుతున్నారు ఈపెట్రోల్‌ బంకు నిర్వాహకులు.. పెట్రోల్‌ ధరల దెబ్బకు ఇక్కడ సీన్‌ రివర్స్‌ అయింది.. ఈ ఒక్క బంకే కాదు.. కర్నాటక సరిహద్దు ప్రాంతాలైన సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, నియోజకవర్గాల్లోని మెజారిటీ బంకుల పరిస్థితి ఇదే..

తెలంగాణలో పెట్రోల్‌ ధరలు ఎక్కువగా ఉండటం.. కర్నాటకలో తక్కువగా పెట్రోల్‌ దొరుకుతుండటంతో వాహనదారులంతా కర్నాటక పెట్రోల్‌ బంకులకు క్యూ కడుతున్నారు.. ఫలితంగా ఇక్కడి బంకులకు జనం రాక నిల్వలు పేరుకుపోయాయి.. సొంతూరి పక్కన పెట్రోల్‌ బంకు ఉన్నా దాన్ని కాదని కర్నాటకు వెళ్తున్నారు. తెలంగాణతో పోల్చుకుంటే కర్నాటకలో పెట్రోల్‌, డీజిల్‌పై పది రూపాయల వరకు తక్కువకు దొరుకుతోంది..

తెలంగాణలో లీటరు పెట్రోల్‌ 120 రూపాయల 85 పైసలు ఉంటే.. కర్నాటకలో 110 రూపాయల 85పైసలుకే లభిస్తోంది.. తెలంగాణలో లీటరు డీజిల్‌ 106 రూపాయలు 76 పైసలకు లభిస్తుండగా.. కర్నాకటలో 96 రూపాయలకే దొరుకుతోంది.. దీంతో జనం కర్నాటక బంకులవైపు క్యూ కడుతున్నారు. కర్నాటక సరిహద్దుల్లో ఉన్న పెట్రోల్‌ బంకుల్లో ఎక్కువగా తెలంగాణ ప్రాంత ప్రజల వాహనాలే కనిపిస్తున్నాయి.

కొందరు పెద్ద పెద్ద క్యాన్లలో నింపుకుంటున్నారు. రైతులు కూడా వారి అవసరాల కోసం ఒకేసారి 20 నుంచి 30వేల రూపాయల వరకు డీజిల్‌ను కొనుగోలు చేస్తున్నారు.. ప్రైవేటు వాహనాలే కాదు.. ప్రభుత్వ వాహనాల కోసం కూడా పక్క రాష్ట్రం నుంచి డీజిల్‌ తెప్పించుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. మొన్నటికి మొన్న నారాయణఖేడ్‌ ఆర్టీసీ డిపోలోకి కూడా కర్నాటక రాష్ట్రం నుంచి డీజిల్‌ తెప్పించారు.

ఇదే వాహనాన్ని పోలీసులు ప్టటుకోగా అన్ని అనుమతులు ఉన్నాయని అధికారులు చెప్పడంతో వదిలేశారు. తెలంగాణలో ఉన్న పెట్రోల్‌ బంకుల యజమానులు మాత్రం అలా పక్క రాష్ట్రాల నుంచి పెట్రోల్‌, డీజిల్‌ తీసుకుని రావడానికి అనుమతి లేదని అంటున్నారు. ఇలా చేయడం వల్ల ఇక్కడ తాము తీవ్రంగా నష్టపోతున్నామని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story