జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ బిల్లుకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం

తెలంగాణ మంత్రివర్గం ముగిసింది. దాదాపు నాలుగు గంటలుగా సాగిన ఈ కేబినెట్ సమావేశంలో...... వివిధ చట్టాల సవరణ ముసాయిదా బిల్లులపై ప్రధానంగా చర్చించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో... జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముగ్గురు పిల్లలున్న పోటీ చేసే అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఇక గ్రేటర్ ఎన్నికల్లో ... పాత రిజర్వేషన్లే కొనసాగింపునకు మొగ్గు చూపింది.
తప్పనిసరిగా 10 శాతం గ్రీనరీ పాటేంచేలా కార్పొరేటర్లను బాధ్యులు చేస్తూ సవరణ చేయాలని నిర్ణయించింది తెలంగాణ మంత్రివర్గం. వార్డ్ కమిటీలు, వార్డ్ అధికారులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో పాటు CRPC చట్టంలో కొన్ని సవరణలు చేయాలని నిర్ణయించింది. ఇక యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణిత పంట సాగు విధానం, ధాన్యం కొనుగోలుపై కేబినెట్ లో చర్చించారు. ఈ నెల 13న శాసన సభ, 14న శాసన మండలి సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్ ఆమోదించిన తీర్మానాలను బిల్లు రూపంలో 13న అసెంబ్లీలో , 14న మండలిలో ప్రవేశ పెడతారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com