సీఎం కేసీఆర్ అధ్యక్షత‌న మంత్రివ‌ర్గ స‌మావేశం

సీఎం కేసీఆర్ అధ్యక్షత‌న మంత్రివ‌ర్గ స‌మావేశం
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో తెలంగాణ క్యాబినెట్ భేటీ ప్రారంభం అయింది..రాష్ట్రంలో కరోనా ఉద్దృతి పై మంత్రివర్గం చర్చించనుంది.

సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో తెలంగాణ క్యాబినెట్ భేటీ ప్రారంభం అయింది..రాష్ట్రంలో కరోనా ఉద్దృతి పై మంత్రివర్గం చర్చించనుంది. తెలంగాణలో లాక్ డౌన్ ఉంటుందా? కఠిన అంక్షలే చేపడుతారా? అన్నది తేలిపోనుంది. అటు తెంగాణలో గత రెండు వారాలుగా రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుండగా, ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమల్లో ఉంది. ప్రధానంగా చూస్తే ఇతర రాష్ట్రాల నుంచి కరోనా బాధితులు పెద్ద ఎత్తున వస్తుండడంతో వారికి ట్రీట్మెంట్ అందించడం సమస్యగా మారుతుంది.

టీకాలు, ఆక్సిజన్, రెమ్ డెసివిర్ వంటి మందులకు ఇబ్బందిగా ఉందని వైద్య ఆరోగ్య వర్గాలు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ కరోనా కట్టడి కావడం లేదని లాక్ డౌన్ వల్లే నియంత్రణ సాధ్యమని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.. రాష్ట్ర హైకోర్టు కూడా వారాంతపు లాక్ డౌన్ పైన ఆలోచించాలని ప్రభుత్వానికి సూచించింది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ పెట్టాలా? ఒకవేళ లాక్ డౌన్ పెడితే ఎదురయ్యే పరిణామాలు తదితర అంశాలపై కేబినెట్ దృష్టి సారించింది.

Tags

Read MoreRead Less
Next Story