కెనడాలో తెలంగాణ ధూం.. ధాం

కెనడాలో తెలంగాణ ధూం.. ధాం
తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు

తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా కెనడాలోని గ్రేటర్‌ టోరంటోలో ధూమ్‌ ధామ్‌ వేడుకలు నిర్వహించారు. అనాపిలిస్ హాల్స్, మిస్సిసాగా, కెనడాలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ వేడుకల్లో సుమారు 15వందలకు పైగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు. కమిటీ కార్యదర్శి శంతన్ నేరళ్లపల్లి ప్రారంభించగా, లావణ్య ఏళ్ల, అనూష ఇమ్మడి, స్వాతి అర్గుల, రాధిక దలువాయి, రజిని తోట జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ కెనడా అసోసియేషన్ శ్రీనివాస్ మన్నెంతో పాటు పలువురు ప్రసంగించారు.

ఉత్సవాల్లో భాగంగా ముందుగా అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. మునుపెన్నడు లేనివిధంగా చిన్నారులకు టాలెంట్ షోని నిర్వహించారు. దీనికి చిన్నారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. చిన్నారులు సింగింగ్, డాన్సింగ్, రూబిక్స్ క్యూబ్ తో పాటు పలు విభాగాల్లో తమ టాలెంట్‌ను చూపించారు. ఈ షోలో గెలుపొందిచిన చిన్నారులకి రియల్టర్‌ విష్ణు బోడ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమం మొత్తం నాలుగు గంటల పాటు సాగింది. ఉమెన్స్ కమిటీ సభ్యులు రాధికా బెజ్జంకి, మాధురి చాతరాజు ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసింది. ఇక ఈ వేడుక స్పాన్సర్ బెస్ట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ ట్యూటరింగ్ సంస్థలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా TCA నిర్వహించిన కార్యక్రమాలు తమను ఎంతో ఆకర్షించాయని కెనడా కాన్సుల్-కౌన్సిలేట్ జనరల్ ఆఫ్ ఇండియా శుభన్ క్రిషన్ అన్నారు. కల్చరల్ విభాగంలో పాల్గొన్న చిన్నారులని ప్రోత్సాహించి నందుకు TCAను అభినందించారు. TCA ఈవెంట్స్ స్పాన్సర్లు, నిర్వహకులకి ప్రత్యేక అభినందనలు తెలిపారు శ్రీనివాస్ మన్నెం. TCA ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు లోకల్ టాలెంట్ బయటకు తీయడంపై ప్రశంసలు గుప్పించారు.

Tags

Next Story