TG: : మాదిగలు 32 లక్షలు, మాలలు 15 లక్షలు

TG: : మాదిగలు 32 లక్షలు, మాలలు 15 లక్షలు
X
ఎస్సీల్లోని 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజన... ఎవ్వరికీ అన్యాయం జరగదన్న మంత్రులు

ఎస్సీల్లోని 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజిస్తూ కమిషన్ సిఫారసు చేసింది. గ్రూప్ 1లో సామాజికంగా వెనుకబడ్డ 15 కులాలకు ఒక శాతం రిజర్వేషన్.. గ్రూప్ 2లో ఉన్న 18 కులాలకు 9 శాతం.. గ్రూప్ 3లో ఉన్న 26 కులాలకు 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కమిషన్ సిఫారసు చేసింది. గ్రూప్ 1లో భర్తీ చేయని ఖాళీలను గ్రూప్ 2,3లో భర్తీ చేయాలి. ఎస్సీ వర్గీకరణలో క్రిమిలేయర్ పెట్టాలన్న కమిషన్ సిఫారసును ప్రభుత్వం తిరస్కరించింది. తెలంగాణలో మాదిగ జనాభా 32,33,642గా పేర్కొంటూ గ్రూప్-2 లో చేర్చింది. మాదిగతో పాటు చమర్, ముచి, చిందోల్లు, బైండ్ల కులాలు ఈ గ్రూపులో ఉన్నాయి. తెలంగాణలో మాలల జనాభా 15,27,143గా ఉందని చెబుతూ వీరిని గ్రూప్-3లో చేర్చారు. గ్రూప్-1లో బుడ్గ జంగం, మన్నే, మాంగ్ కులాలు ఉన్నాయి.


ఎవ్వరికీ అన్యాయం జరగదు: మంత్రి దామోదర

ఎస్సీ వర్గీకరణ వల్ల కొందరిలో భయం, అభద్రతాభావం కలుగుతోందని.. వర్గీకరణ వల్ల ఎవరి ప్రయోజనాలకు విఘాతం కలగదని మంత్రి దామోదర నరసింహ స్పష్టం చేశారు. అంటరానితనం అనేది ప్రపంచం అంతటా ఉందని.. ఎంత చదువుకున్నా.. ఎంత ఎదిగినా.. ఎక్కడో ఒకచోట వివక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. సామాజిక ఫలాలు అందరికీ అందాలనేది కాంగ్రెస్‌ పార్టీ తపన అని దామోదర వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ నిర్ణయం రాజకీయ కారణాలతో తీసుకోలేదని తెలిపారు. ప్రభుత్వానికి సంబంధం లేకుడా కమిషన్‌ అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ ది తప్పుడు ప్రచారం

తెలంగాణ కులగణన సర్వేలో బీసీ జనాభా తగ్గిందంటూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన సర్వేలో ముస్లిం బీసీలను కలిపిన తర్వాత బీసీ జనాభా 51 శాతంగా ఉన్నట్లు చూపించారని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన తాజా కులగణన సర్వే ప్రకారం బీసీ జనాభా 56 శాతంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్వేలో బీసీ జనాభా పెరిగిందని స్పష్టం చేశారు.

Tags

Next Story