KCR : హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతం చేయాలి : కేసీఆర్

KCR : హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతం చేయాలి : కేసీఆర్
KCR : దేశభక్తి భావన, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి మేల్కొలిపేలా స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను నిర్వహించాలన్నారు సీఎం కేసీఆర్‌

KCR : దేశభక్తి భావన, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి మేల్కొలిపేలా స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను నిర్వహించాలన్నారు సీఎం కేసీఆర్‌. యావత్ తెలంగాణ సమాజం ఈ ఉత్సవాల్లో పాలు పంచుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. కోటి 20 లక్షల గృహాలకు జాతీయ జెండాలను పంపిణీ చేయాలని ఆదేశించారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా ఆగస్టు 8 నుంచి 22 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం ఎంపీ కేశవరావు నేతృత్వంలోని కమిటీ సభ్యులతో ప్రగతిభవన్‌లో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.

ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా కార్యక్రమం విజయవంతమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఈ నెల 9 నుంచే రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండాలను పంపిణీ చేయాలని సూచించారు. జెండాల పంపిణీ మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో జరగాలన్నారు.

ఇక ఈ నెల 8న వజ్రోత్సవ వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని HICCలో ఘనంగా నిర్వహించాలన్నారు. ఇందులో భాగంగా ఆర్మీ, పోలీస్ బ్యాండుతో రాష్ట్రీయ సెల్యూట్, జాతీయ గీతాలాపన, స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించే సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

బస్టాండ్స్, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, దవాఖానాలు, షాపింగ్‌ మాల్స్‌ ప్రత్యేకంగా అలంకరించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ భవనాలు, ఇతర ప్రతిష్టాత్మక భవనాల్లో పదిహేను రోజుల పాటు ప్రత్యేక విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు వ్యాస రచన, చిత్ర లేఖనం, దేశభక్తి గీతాల పోటీలు, కవితా రచన పోటీలు నిర్వహించాలని సూచించారు. ప్రార్థనా సమయంలో ఎంపిక చేసిన దేశభక్తి గీతాలను వినిపించాలన్నారు. రిచర్డ్ అటెన్‌ బరో నిర్మించి, దర్శకత్వం వహించిన గాంధీ సినిమాను రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో ప్రదర్శించాలన్నారు.

స్వాతంత్ర్యోద్యమం నేపథ్యంగా రాష్ట్రవ్యాప్తంగా కవి సమ్మేళనాలు, ముషాయిరాలు నిర్వహించాలని సూచించారు. 2కె రన్‌ లాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నరాు. రక్తదాన శిబిరాలు, స్వాతంత్ర వీరులకు ఘన నివాళులు అర్పించాలని సీఎం నిర్ణయించారు. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఆగష్టు 15కు ముందు రోజు అంటే 14న తాలూకా, జిల్లా కేంద్రాలతో పాటు హైదరాబాద్ టాంక్‌బండ్‌పై బాణాసంచా కార్యక్రమం నిర్వహించాలన్నారు.

ప్రముఖ గాయకులు, సంగీత విద్వాంసులతో సంగీత విభావరి నిర్వహించాలన్నారు. నిరాదరణకు గురైన వర్గాలను గుర్తించి వారిని ఆదుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాకొక ఉత్తమ గ్రామ పంచాయితీని, పాఠశాలను, ఉత్తమ రైతు, డాక్టర్‌, ఇంజినీరు, పోలీసు అధికారులు సహా ఇతర రంగాలకు చెందిన వారిని గుర్తించి సత్కరించాలని సీఎం నిర్ణయించారు.

Tags

Read MoreRead Less
Next Story