REVANTH: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం

REVANTH: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి.... మహిళా శక్తి పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి

తెలంగాణలో వచ్చే ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా మహిళా శక్తి పథకం ప్రారంభించిన సీఎం అడబిడ్డలను కోటీశ్వరులను చేస్తే తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందన్నారు. మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు వడ్డీలేని రుణాలు ఇవ్వనుండగా....వచ్చే ఐదేళ్లలో లక్ష కోట్ల ఆర్థిక సహకారం అందిస్తామని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులకు... నైపుణ్య శిక్షణ, ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పన వంటి చర్యలు చేపడతామన్నారు.స్వయంసహాయక సంఘాల మహిళల రుణాలకు బీమా పథకాన్ని కూడా ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల్లోని... 63.86 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి 10 లక్షలు చొప్పున జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు..రేవంత్ వివరించారు. అన్ని ప్రభుత్వ పాఠశాల్లో.. పారిశుధ్యం, నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగిస్తామన్న ఆయన...మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అప్పగిస్తామని చెప్పారు. ఇదే సమయంలో విపక్షాల తీరుపై మండిపడిన రేవంత్ రెడ్డి... మహిళలకు అమలుచేస్తున్న పథకాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం....... తమపై 7లక్షల కోట్ల అప్పును రుద్దినప్పటికీ........ ఒక్కొక్కటిగా హామీలను అమలు చేస్తున్నామని వివరించారు.


మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. కాళేశ్వరం సహా భద్రాద్రి, యాదాద్రి విద్యుత్‌ ప్రాజెక్టులపై విచారణకు కమిటీలు వేసింది. అర్హులందరికీ తెల్లరేషన్‌ కార్డులు ఇచ్చేందుకు ఆమోదం తెలిపిన కేబినెట్‌...16 కార్పొరేషన్ల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. లోక్‌సభ ఎన్నికల ముంగిట సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలను తీసుకుంది. మరికొన్ని గ్యారెంటీలు అమలుకు నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం మొదటి విడతగా 4 లక్షల 56 వేల ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. అర్హులందరికీ తెల్లరేషన్‌ కార్డులు ఇవ్వాలని తీర్మానించింది.

కాళేశ్వరం సహా భద్రాద్రి, యాదాద్రి విద్యుత్‌ ప్రాజెక్టులపై సర్కారు విచారణకు నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ నేతృత్వంలో కమిటీ వేసిన కేబినెట్‌...100 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని కమిటీకి సూచించింది. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్‌ ప్రాజెక్టులపై విచారణకు నిర్ణయం తీసుకున్న మంత్రివర్గం... విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్.నరసింహారెడ్డి నేతృత్వంలో విద్యుత్‌ ప్రాజెక్టులపై విచారణకు నిర్ణయించింది. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్‌ కొనుగోళ్ల అంశంపైనా.. విచారణకు కేబినెట్‌ పచ్చజెండా ఊపింది.


ఔటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ...జిల్లాల వారీగా స్వయం సహాయక సంఘాలకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలని మంత్రివ‌ర్గం నిర్ణయించింది. ఓఆర్‌ఆర్‌ చుట్టూ జిల్లాలవారీగా 25 నుంచి 30 ఎకరాల్లో అమ్ముకునే సౌకర్యం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సహా 16 కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించిన మంత్రివర్గం... మినిమం టైం స్కేల్‌తో 2008 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధమైంది.

Tags

Read MoreRead Less
Next Story