సీఎం కేసీఆర్ ఆడియో కాల్ సోషల్‌మీడియాలో హల్‌చల్..!

X
By - Gunnesh UV |24 July 2021 7:00 PM IST
CM KCR Audio Call : హుజూరాబాద్ ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ దృష్టిపెట్టారు. స్వయంగా రంగంలోకి దిగిన కేసీఆర్..స్థానిక నేతలతో మాట్లాడారు.
CM KCR Audio Call : హుజూరాబాద్ ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ దృష్టిపెట్టారు. స్వయంగా రంగంలోకి దిగిన కేసీఆర్..స్థానిక నేతలతో మాట్లాడారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనగుల ఎంపీటీసీ నిరోష భర్త రామస్వామికి సీఎం కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. కేసీఆర్ మాట్లాడిన ఆడియోకాల్ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. కొత్తగా తీసుకొస్తున్న దళితబంధు పథకం గురించి వివరించిన కేసీఆర్...ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈనెల 25 హుజూరాబాద్‌కు చెందిన దళితులు ప్రగతిభవన్ రావాలని కేసీఆర్ ఆహ్వానించారు. ముఖ్యమంత్రే స్వయంగా ఫోన్ చేసినందుకు సంతోషంగా ఉందన్న రామస్వామి..దళిత బంధు పథకంపై తన సలహాలు, సూచనలు తెలియజేయమని కేసీఆర్ చెప్చినట్లు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com