సీఎం కేసీఆర్ బాల్య మిత్రుడు మృతి!

సీఎం కేసీఆర్ బాల్య మిత్రుడు మృతి!
X

CM KCR With his Friend sampath kumar (File photo)

తెలంగాణ సీఎం కేసీఆర్ చిన్ననాటి మిత్రుడు సంపత్‌ కుమార్‌ గుండెపోటుతో బుధవారం రాత్రి కన్నుమూశారు. సంపత్‌కుమార్‌ స్వస్థలం కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం కొండపల్కల గ్రామం.. సీఎం కేసీఆర్, సంపత్‌కుమార్‌ చదువుకునే రోజుల్లో మంచి స్నేహితులని, ఒకే గదిలో ఉండేవారిని గ్రామస్థులు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రము ఏర్పడి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక సీఎం హోదాలో కరీంనగర్ కి వెళ్ళినప్పుడు ఉత్తర తెలంగాణ భవన్‌లో ఉన్న కేసీఆర్‌ను కలిసేందుకు సంపత్‌కుమార్‌ వెళ్లారు. అప్పుడు కేసీఆర్ చిరునవ్వుతో సంపత్‌ కుమార్‌ ను పలకరించి, ఆప్యాయతతో హత్తుకున్నారు.

అక్కడ ఉన్న మంత్రులకి, ఎమ్మేల్యలకి సంపత్‌ కుమార్‌ ను పరిచయం చేశారు. ఆ రోజున సంపత్ కుమార్ ఎంతో సంతోషించారు. కాగా, సంపత్‌కుమార్‌ వివాహం చేసుకోకపోవడంతో ఆయన అంత్యక్రియలను ఆయన సోదరుడు నిర్వహించారు.

Tags

Next Story