KCR : అసోం సీఎంను వెంటనే బర్తరఫ్ చేయాలి : కేసీఆర్

X
By - TV5 Digital Team |12 Feb 2022 5:56 PM IST
KCR : రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిస్వా శర్మ అనుచిత వ్యాఖ్యలపై భువనగిరి సభలో కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
KCR : రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిస్వా శర్మ అనుచిత వ్యాఖ్యలపై భువనగిరి సభలో కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంకోసం ఎంతో చేసిన ఘనచరిత్ర ఉన్న కుటుంబానికి చెందిన రాహుల్ గురించి అసోం సీఎం చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. రాహుల్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కించపరుస్తారా అంటూ అగ్రహంవ్యక్తం చేశారు. అసభ్యంగా మాట్లాడటమే బీజేపీ సంస్కారమా అని నిలదీశారు. అసోం సీఎంను ప్రధాని మోదీ వెంటనే భర్తరప్ చేయాలని డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com