CM KCR : బీజేపీ పాలన అంటే దేశాన్ని అమ్మడం : కేసీఆర్

KCR (tv5news.in)
CM KCR : కేంద్ర బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్
కేంద్ర బడ్జెట్ చాలా దారుణంగా ఉంది-సీఎం కేసీఆర్
ఆర్థికమంత్రి మహాభారతంలో శ్లోకం చెప్పారు-సీఎం కేసీఆర్
రాజ్యాన్ని రాజు ఎలా నడపాలో ఆ శ్లోకంలో ఉంది-సీఎం కేసీఆర్
రాజులు భూమిని న్యాయమార్గంలో, ధర్మమార్గంలో నడపాలని ఉద్దేశ్యం
దళితులు, గిరిజనుల పట్ల కేంద్రానికి చిత్తశుద్ధి లేదు
బడ్జెట్‌లో పేదలకు దక్కింది గుండు సున్నా
నిర్మలా సీతారామన్ తనను తాను ఆత్మవంచన చేసుకున్నారు
బడ్జెట్‌లో గోల్‌మాల్ తప్ప ఎవరికీ ఏమిలేదు
ఎరువులపై రూ.35 వేల కోట్ల సబ్సిడీ తగ్గించింది
గ్రామీణ ఉపాధి హామీ పథకాల్లో రూ.25 వేల కోట్లు తగ్గించారు
దేశంలో ఎస్సీ-ఎస్టీల జనాభా చాలా పెరిగింది
ఎస్సీ జనాభాపై కేంద్రం తప్పు లెక్కలు చెబుతోంది
ఎవరి కోసం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు..?
బడ్జెట్ అంతా పైన పటారం.. లోన లొటారం
ఘోరమైన పద్దతిలో దేశాన్ని నాశనం చేస్తున్నారు
దిక్కుమాలిన గుజరాత్ మోడల్‌ను అడ్డుపెట్టుకుని ప్రధాని అయ్యారు
తలాతోక లేని మోడల్‌తో దేశ ప్రజలను మోసం చేస్తున్నారు
విద్యుత్ సంస్కరణలంటూ మెంటల్ కేసు పట్టుకున్నారు
పవిత్రమైన గంగానదిలో శవాలు తేలేలా చేసిన ప్రభుత్వం ఇది
రైతుల నుంచి విద్యుత్ ఛార్జీలు వసూలు చేయాలన్నదే లక్ష్యం
కరోనా సమయంలోను వైద్య రంగానికి కేటాయింపులు లేవు
బీజేపీ పాలన అంటే దేశాన్ని అమ్మడం
దేశంలో రూ.68 వేల కోట్ల ఆహార సబ్సిడీని తగ్గించారు
సాగు చట్టం ఉద్యమంలో 700 మంది రైతులు చనిపోయినా..
బడ్జెట్‌లో కేటాయింపులు శూన్యం
ఎల్‌ఐసీని కేంద్రం ఎందుకు అమ్ముతోంది
బీజేపీ ఏడేళ్ల పాలనలో రైతుల ఆదాయం రెట్టింపు చేయలేదు
బ్యాంకులను ముంచిన గజదొంగలను దేశం దాటించేశారు
దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతోంది
బీజేపీని కూకటివేళ్లతో పెకిలించివేయాలి
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com