KCR Medaram Tour : నేడు మేడారానికి సీఎం కేసీఆర్..!

KCR Medaram Tour : వనారణ్యం మొత్తం జనారణ్యంగా మారింది. మేడారం మహా జాతరలో భాగంగా ఇవాళ సీఎం కేసీఆర్ సమ్మక్క-సారలమ్మను దర్శించుకోనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారానికి వెళ్లనున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారని అధికారులు వెల్లడించారు.
అక్కడే మేడారం అభివృద్ధిపైనా సమీక్షించే అవకాశం ఉంది. సీఎం వెంట సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు అధికారులు.
మేడారం మహా జాతరకు లక్షల మంది భక్తులు తరలివస్తున్నారు. గద్దెలపై సమ్మక్క-సారలమ్మ కొలువు దీరారు. దీంతో జాతరకు పూరిపూర్ణ శోభ వచ్చింది. అమ్మలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఇవాళ నిండు జాతర ఉంటుంది. జంపన్న వాగు తీరం జనసాగరాన్ని తలపిస్తోంది.
స్నానఘట్టాలు నిండిపోతున్నాయి. రేపు సాయంత్రం దేవతల వన ప్రవేశంతో మేడారం మహాజాతర ముగుస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com