KCR : అఖిలేష్ యాదవ్‌తో సీఎం కేసీఆర్ భేటీ

KCR : ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్... కేసీఆర్‌తో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలు, బీజేపీ తీరుపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరుగుతోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్... పలు రాజకీయ పార్టీల నేతలతోనూ సమావేశం కానున్నారు.
ఢిల్లీ పర్యటన అనంతరం... ఈ నెల 22న చంఢీగడ్, ఈ నెల 26న బెంగళూరులో కేసీఆర్ పర్యటిస్తారు. మాజీ ప్రధాని దేవగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్ భేటీ అవుతారు. ఈ నెల 27న మహారాష్ట్ర లో కేసీఆర్ పర్యటిస్తారు. ఈ పర్యటనలో రాలేగావ్‌సిద్ధిలో అన్నాహజారేతో కేసీఆర్ భేటీ అవుతారు.
ఈ నెల 29,30 తేదీల్లో బంగాల్, బిహార్‌లో కేసీఆర్ పర్యటించనున్నారు. గాల్వాల్ లోయలో మరణించిన సైనిక కుటుంబాలకు సీఎం పరామర్శించనున్నారు. మరణించిన సైనిక కుటుంబాలకు కేసీఆర్ ఆర్థిక సాయం అందజేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com