CM KCR : అన్నిజిల్లాల కలెక్టర్లలతో సీఎం కేసీఆర్ సమావేశం..!

CM KCR : ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంపై సీఎం కేసీఆర్ దృష్టిపెట్టారు. జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్ సహా సీనియర్ అధికారులు హాజరయ్యారు. హుజురాబాద్ సహా నాలుగు మండలాల్లో ప్రస్తుతం దళిత బంధు పథకం అమల్లో ఉంది. మార్చి నాటికి అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు పథకాన్ని అమల్లోకి తేవాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి.. అధికారులు, ప్రజాప్రతినిధులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది.
మరోవైపు రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారిన ధాన్యం కొనుగోళ్లపైనా సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ అధికారులు కూడా సమావేశానికి హాజరయ్యారు. గత కొద్ది నెలలుగా కేంద్రంతో పోరాడుతున్న కేసీఆర్ ప్రభుత్వం.. రైతుల ఇబ్బందులను ఏ విధంగా పరిష్కరించాలి అన్నదానిపై చర్చిస్తున్నారు. ఇదే విషయమై కొద్దిరోజుల క్రితం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో కూడా సీఎం కేసీఆర్ చర్చించారు. కేంద్రంతో పోరాటంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అన్నదానిపై చర్చించారు. ఈ నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ జరుపుతున్న సమీక్షా సమావేశానికి ప్రారధాన్యత ఏర్పడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com