KCR Nalgonda Tour : ఇవాళ నల్గొండ జిల్లాకు సీఎం కేసీఆర్..!

KCR Nalgonda Tour : ఇవాళ నల్గొండ జిల్లాకు వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ తండ్రి మారయ్య దశదినకర్మలో ఆయన పాల్గొంటారు. పట్టణంలోని కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో మారయ్య చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటిస్తారు.
హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి నల్గొండ ఎన్జీ కాలేజీ గ్రౌండ్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గాదరి కిశోర్ ఇంటికి చేరుకుంటారు. ఎమ్మెల్యేను, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి...తర్వాత తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు.
కేసీఆర్ పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, అధికారులు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రాజేశ్వరి కలిసి హెలిప్యాడ్ పనులను, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com