KCR : కేసీఆర్‌ జాతీయ కూటమికి బ్రేకులు పడ్డట్లేనా..?

KCR : కేసీఆర్‌ జాతీయ కూటమికి బ్రేకులు పడ్డట్లేనా..?
KCR : ఇటీవల బీజేపీ మీద యుద్ధభేరి మోగించారు కేసీఆర్. జాతీయ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టిస్తానని ప్రకటించి.. రాష్ట్రాల సీఎంలతో భేటీ అయ్యారు.

KCR : ఇటీవల బీజేపీ మీద యుద్ధభేరి మోగించారు కేసీఆర్. జాతీయ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టిస్తానని ప్రకటించి.. రాష్ట్రాల సీఎంలతో భేటీ అయ్యారు. దేశంలో పలు ప్రాంతీయ పార్టీల నాయకులను కేసిఆర్ కలుసుకున్నారు. త్వరలో దేశంలోని వివిధ పార్టీల నాయకులతో సమావేశానికి ప్లాన్ చేశారు. అంతేకాదు హైదరాబాద్ వేదికగా రైతు సదస్సు నిర్వహించి బీజేపీని దోషిగా నిలబెట్టాలనే ప్రణాళికలు సిద్దం చేశారు. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో టిఆర్ఎస్ నాయకులు కేసీఆర్‌ దేశ్ కీ నేత అంటూ హడావుడి చేశారు. ఈ దేశం బాగుపడాలంటే కేసీఆర్ ప్రధాని కావాలంటూ ఏ ప్రోగ్రామ్ జరిగినా గులాబీ శ్రేణులు స్పీచ్ లు ఇచ్చారు.

అయితే వారం రోజుల క్రితం సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. వయసురీత్యా వస్తున్నటువంటి సమస్యలతో కెసిఆర్ సతమతమవుతున్నారని ... కచ్చితంగా రెస్ట్ అవసరమని డాక్టర్లు సూచించారు. దీంతో కేసిఆర్ చేస్తున్న ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు సభలో కేసీఆర్ ప్రసంగించినప్పటికీ... గతంలో ఉన్నంత హుషారుగా సీఎం లేరని టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు . ఇలాంటి పరిస్థితుల్లో కొత్త కూటమి పర్యటన చేస్తే కెసిఆర్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని డాక్టర్లు కూడా సూచించారట . ఇప్పట్లో జిల్లాల పర్యటన కూడా చేయొద్దని వైద్యుల సలహాలు ఇవ్వడంతో... ఇక దేశ రాజకీయాలపై కెసిఆర్ తాత్కాలిక విరామం తీసుకున్నట్టే అని పలువురు టీఆర్ఎస్ నేతలు అంటున్నారు.

గతంలో కేసీఆర్ చేసిన ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలకు కూడా మధ్యలోనే బ్రేక్ పడ్డాయి. అప్పట్లో బీజేపీ హవా కొనసాగడంతో కేసీఆర్‌ ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. ఇక గడిచిన ఆరేడు నెలలుగా బీజేపీపై కేంద్రం ప్రభుత్వ విధానాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న గులాబీ బాస్ ...మళ్లీ దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ముంబై తో పాటు జార్ఖండ్ రాంచీలో కూడా పర్యటించి కొత్త కూటమి మరోసారి ప్రయత్నాలు చేశారు. కానీ అనూహ్యంగాకేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో కొత్త కూటమి ఏర్పాటుకు రెండో దఫా ప్రయత్నాలకు కూడా బ్రేక్ పడినట్టే అయింది. భారీ ప్రణాళికతో కెసిఆర్ మొదలు పెట్టినా... రాష్ట్ర పర్యటనలు కూడా ఇప్పట్లో జరిగేటట్లు లేవు అని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

ఇక దీనికి తోడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు కేసిఆర్ బీజేపీ మీద దూకుడుగానే ముందుకు వెళ్ళారు. కేసిఆర్ వెళ్లిన ప్రతి రాష్ట్రం లో ఫ్లెక్సీలు, హోర్డింగ్ లతో అదరగొట్టారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ కి వ్యతిరేక ఫలితాలు వస్తాయని అంచనాతో కేసిఆర్ కేంద్రం టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఇక తాను కలిసిన ప్రాంతీయ పార్టీల అధినేతలతో కూడా బీజేపీ పతనం అవుతుందన్న విషయాన్ని ప్రస్తావించి తనతో కలిసి రావాల్సిందిగా కోరారు. రాజకీయ వ్యూహకర్త పీకే సలహాలతో బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ కూటమి ప్రయత్నాలు మొదలు పెట్టారు. కానీ బీజేపీ ఓడుతుందని కేసిఆర్ వేసిన అంచనాలు తప్పాయి. నాలుగు రాష్ట్రాల్లో కాషాయదళమే తిరిగి అధికారంలోకి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో విరామం తీసుకోవడమే బెటర్ అని కేసీఆర్‌ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story