KCR : త్వరలోనే దళితబంధు నిధుల విడుదల : సీఎం కేసీఆర్

KCR  : త్వరలోనే దళితబంధు నిధుల విడుదల : సీఎం కేసీఆర్
X
KCR : దళితబంధు పథకం అమలుపైనా రివ్యూ చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.

KCR : దళితబంధు పథకం అమలుపైనా రివ్యూ చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజాన్ని ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా... ఆర్థికంగా అభివృద్ది చేయడమే పథకం లక్ష్యమన్నారు. నూరుశాతం సబ్సిడీ కింద అందించే పది లక్షల రూపాయలు.. దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతంగా పటిష్టం చేయడంలో దోహద పడుతుందన్నారు. దళిత బంధును ఇప్పటికే ప్రకటించిన పద్ధతిలో ప్రభుత్వం అమలు చేస్తుందని.... అందుకు సంబంధించిన నిధులను త్వరలోనే విడుదల చేస్తామని సీఎం స్పష్టం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గం, ఇప్పటికే ప్రకటించిన నాలుగు మండలాల పరిధిలోలాగే పథకం అమలు చేస్తామన్నారు కేసీఆర్.

Tags

Next Story