KCR : డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దు : సీఎం కేసీఆర్‌

KCR : డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దు : సీఎం కేసీఆర్‌
KCR : గంజాయి, డ్రగ్స్‌ వాడకాన్ని తెలంగాణలో సమూలంగా నిర్మూలించేలా చర్యలు తీసుకోవాలని పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖలను ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.

KCR : గంజాయి, డ్రగ్స్‌ వాడకాన్ని తెలంగాణలో సమూలంగా నిర్మూలించేలా చర్యలు తీసుకోవాలని పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖలను ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరి సహకారం తీసుకుని సామాజిక ఉద్యమంగా చేపట్టాలని ఎక్స్‌తోపాటు.. పోలీసులకు సూచించారు. తెలంగాణలో గంజాయి, డ్రగ్స్‌ వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.. డ్రగ్స్‌ వాడకం ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న దుర్‌ వ్యసనమని.. సమాజమనే వేరుకు పట్టిన చీడ పురుగు వంటిదని అన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు సృజనాత్మక కార్యక్రమాలు రూపొందించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు.

వెయ్యి మంది సుశిక్షితులైన పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకుని అత్యాధునిక హంగులతో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే పలు అసాంఘిక శక్తులను వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు ఏర్పాటు చేసుకున్న గ్రే హౌండ్స్ తదితర వ్యవస్థలు విజయవంతంగా పనిచేస్తున్నాయని, అదే తరహాలో నార్కోటిక్ డ్రగ్స్ నియంత్రించే విభాగం కూడా శక్తివంతంగా పని చేయాలన్నారు. అద్భుత పనితీరు కనపరిచే పోలీస్ అధికారులకు అవార్డులు, రివార్డులు ఆక్సెలరేషన్ ప్రమోషన్లు సహా అన్ని రకాల ప్రోత్సాహకాలు అందించాలన్నారు. ఇందుకోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దని, ఈ విషయంలో ఏ పార్టీకి చెందిన వారైనా, నేరస్థులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫారసులను నిర్ద్వందంగా తిరస్కరించాలని పోలీసు అధికారులకు సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story