చేనేత కార్మికులకు బీమా సౌకర్యాన్ని అమల్లోకి తెస్తాం: సీఎం కేసీఆర్

చేనేత కార్మికులకు బీమా సౌకర్యాన్ని అమల్లోకి తెస్తాం: సీఎం కేసీఆర్
X
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, పద్మశాలీలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, పద్మశాలీలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ చేనేత ప్రత్యేక కళ అని, భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తుందని అన్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులను సత్కరించుకుంటూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో అవార్డులు అందిస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. చేనేత కార్మికులకు బీమా సౌకర్యాన్ని అమల్లోకి తేనున్నట్లు తెలిపారు. చేనేతలకు పించన్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని గుర్తుచేశారు. చేనేతలకు రుణమాఫీ, నేతన్నలకు చేయూత, చేనేత మిత్ర పథకాల ఆదుకుంటున్నామన్నారు.

Tags

Next Story