KCR : 75ఏళ్లలో సాధించని అభివృద్ధిని ఎనిమిదేళ్లలో సాధించాం : సీఎం కేసీఆర్
KCR : 8ఏళ్లలోనే దేశానికి దిశానిర్దేశం చేసే స్థాయికి తెలంగాణ వచ్చిందన్నారు సీఎం కేసీఆర్. మంచినీరు దొరకని ప్రాంతం రాష్ట్రం మొత్తంలో లేదన్నారు. ఇక 24గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు సీఎం. 75ఏళ్లలో సాధించని అభివృద్ధిని 8ఏళ్లలో చేసి చూపించామన్నారు. మిషన్ భగీరథన అనేక రాష్ట్రాలకు ఆదర్శమన్న కేసీఆర్... కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలోనే అద్భుతమన్నారు. పబ్లిక్ గార్డెన్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండా ఎగరేశారు. అనంతరం అక్కడ సభలో ప్రసంగించారు. ఉదయం ప్రగతి భవన్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అక్కడి నుంచి గన్‌పార్క్ అమరీవీరుల స్థూపం దగ్గరికి వెళ్లి నివాళులు అర్పించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com