కృష్ణా జలాలపై ఏపీ దాదాగిరి చేస్తుంది: సీఎం కేసీఆర్

CM KCR Speech in Halia: తెలంగాణ పట్ల కేంద్రం వ్యతిరేక వైఖరి అవలంభిస్తుందన్నారు సీఎం కేసీఆర్. ని... అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుందంటూ హాలియా సభలో నిప్పులు చెరిగారు. కేంద్రం, ఏపీ వ్యతిరేక వైఖరితో..కృష్ణా నీటిలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. కృష్ణా జలాల విషయంలో రాబోయే రోజుల్లో తెలంగాణకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నారు.
దళిత బంధుపై కొంత మంది అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని.. ఆరు నూరైనా దళిత బంధు అమలు చేసి తీరతామన్నారు సీఎం కేసీఆర్. తానే స్వయం దళిత బంధు అమలు పర్యవేక్షణ చేస్తానన్నారు. ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తామని... ఈ ఏడాది ప్రతి నియోజకవర్గంలో వందల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందన్నారు. దళిత బంధు ఇవ్వాలని ఎవరూ అడగలేదని.. తానే సమోటోగా అధ్యయనం చేసి ఈ పథకం తీసుకొచ్చానని తెలిపారు.
ఇక ఉప ఎన్నిక సమయంలో తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు సీఎం కేసీఆర్. హాలియా, నందికొండ మున్సిపాల్టీలకు 15 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గుర్రంపోడు లిఫ్ట్ సర్వేకు ఆదేశాలు జారీ చేశామని.. ఆస్పత్రుల్లో మౌళిక వసతుల కల్పనకు కట్టుబడి ఉన్నామన్నారు. అలాగే 8 వేల ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటు, 8 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com