తెలంగాణ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటనపై ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్

X
By - Nagesh Swarna |21 March 2021 4:50 PM IST
పీఆర్సీ పై ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేపు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశముంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించేందుకు మార్గం సుగమమైంది. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక నేపథ్యంలో పీఆర్సీ ప్రకటనకు అనుమతి కోరుతూ రాష్ట్ర ఆర్థికశాఖ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దీనిపై ఈసీ స్పందిస్తూ వేతన సవరణ ప్రకటనకు ఎలాంటి ఇబ్బంది లేదంది. అయితే పీఆర్సీ ప్రకటన ద్వారా రాయకీయలబ్ది పొందేందుకు ప్రయత్నించరాదని పేర్కొంది. అటు పీఆర్సీ పై ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేపు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశముంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com