తెలంగాణలో లాక్ డౌన్?.. కేబినెట్‌లో CM KCR అత్యవసర భేటీ..!

తెలంగాణలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నప్పటికీ కరోనా కేసులు అదుపులోకి రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన పడింది. లాక్ డౌన్ పెట్టాలంటూ అనేక వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో దీనిపైన చర్చించేందుకు నేడు మంత్రి వర్గం భేటీ కానుంది. ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసిఆర్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం రెండు గంటలకు ఈ అత్యవసర సమావేశం జరగనుంది.
అయితే చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ పెట్టినప్పటికీ కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదన్న రిపోర్ట్లు ప్రభుత్వానికి అందుతున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబతున్నాయి. ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించడం వల్ల కలిగే పరిణామాల అంశంపై ఇవ్వాళ మధ్యాహ్నం క్యాబినెట్ చర్చించనుంది.
లాక్ డౌన్ వలన ఎదురయ్యే మీ ఇబ్బందులు, ధాన్యం కొనుగోళ్ళ పై ప్రభావం గురించి చర్చించనున్నారు. దీంతో ఇప్పుడు మంత్రివర్గంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com