Mallanna Sagar Reservoir : నేడు మల్లన్నసాగర్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

Mallanna Sagar Reservoir :  నేడు మల్లన్నసాగర్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
X
Mallanna Sagar Reservoir : తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులో భాగంగా మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది.

Mallanna Sagar Reservoir : తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులో భాగంగా మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద మల్లన్న సాగర్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. దేశంలోనే తొలిసారిగా నదిలేని చోట ప్రాజెక్టును నిర్మాణం చేసింది ఇక్కడే. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రాంతంలో నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా పది జిల్లాలకు తాగు, సాగు నీరు అందనుంది.

Tags

Next Story