CM KCR Visit Gandhi Hospital : డాక్టర్లు, వైద్య సిబ్బందిని అభినందించిన సీఎం కేసీఆర్..!

CM KCR Visit Gandhi Hospital : డాక్టర్లు, వైద్య సిబ్బందిని అభినందించిన సీఎం కేసీఆర్..!
X
CM KCR Visit Gandhi Hospital : సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోని కరోనా ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించారు.

CM KCR Visit Gandhi Hospital : సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోని కరోనా ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించారు. వారిని దైర్యంగా ఉండాలని సూచించారు. కరోనా నివారణకి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇలాంటి విపత్కరమైన సమయంలో కరోనా రోగులకి చికిత్స అందిస్తున్న వైద్యులకి, వైద్య సిబ్బందిని సీఎం కేసీఆర్ అభినందించారు. దాదాపు నలభై నిమిషాల పాటు గాంధీలో కరోనా చికిత్స ఏర్పాట్లను సీఎం గమనించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి హరీష్ రావు, సీఎస్, వైద్యారోగ్యశాఖ అధికారులున్నారు. అటు సీఎం హోదాలో కేసీఆర్ గాంధీ ఆసుపత్రిని పరిశీలించడం ఇదే మొదటిసారి.

Tags

Next Story