KCR Yadadri Tour : యాదాద్రి పునర్నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్

KCR Yadadri Tour :  యాదాద్రి పునర్నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
KCR Yadadri Tour : యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. ఆలయ పునర్ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకోవడంతో సీఎం ఆలయ పనులను పరిశీలించారు.

KCR Yadadri Tour : యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. ఆలయ పునర్ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకోవడంతో సీఎం ఆలయ పనులను పరిశీలించారు. మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా యాదాద్రికి చేరుకున్న సీఎం... ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం లక్ష్మీ నర్సింహస్వామి వారిని దర్శించుకొనిపూజలు చేశారు. ఈ సందర్బంగా కేసీఆర్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు సీఎంకు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ ఈవో స్వామివారి ప్రసాదాన్ని కేసీఆర్ కు అందించారు.

పూజల అనంతరం సీఎం కేసీఆర్..ఆలయ పునర్ నిర్మాణ పనులను పరిశీలించారు. పరిసరాలను కలియతిరుగుతూ... ప్రధానాలయం, గర్భాలయాన్ని సందర్శించి పరిశీలించారు. కాలినడకన తిరుగుతూ అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించారు. కళ్యాణ కట్ట, పుష్కరణి ఏర్పాట్లను చూశారు. ఈసందర్బంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఆలయ పునర్ ప్రారంభంలో భాగంగా తలపెట్టనున్న యాగస్థలాన్ని పరిశీలించారు. 75 ఎకరాల సువిశాల ప్రాంగణంలోని జరుగుతున్న పనులను చూశారు.

అనంతరం భక్తుల సౌకర్యార్ధం నిర్మిస్తున్న సత్రాల నిర్మాణం, ఆర్టీసి బస్‌ స్టాండ్‌ పనులను పరిశీలించారు సీఎం కేసీఆర్. పుష్కరిణిలో పురుషులకు, మహిళలకు వేరువేరుగా స్నానాలు ఆచరించేందుకు జరుగుతున్ననిర్మాణాలను పరిశీలించారు. వ్రత మండప నిర్మాణం, దీక్షాపరుల మండపాలను సీఎం చూశారు.

ఆలయ పునర్ నిర్మాణపనులను పరిశీలించిన అనంతరం కేసీఆర్..సుదర్శన యాగం, ఆలయ పనులపై అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆలయ పునర్ ప్రారంభోత్సవ వేడుకలనాటికి అన్ని పనులు పూర్తికావాలని ఆదేశించారు. తాను సూచించిన సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకొని పనులు త్వరిగతిన పూర్తిచేయాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story