KCR Latter To Modi : ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖ..!

KCR Latter To Modi : ప్రధాని మోదీకి లేఖ రాశారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణిలో తలపెట్టిన 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని నిలిపి వేయాలని విన్నవించారు. 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునివ్వడంతో.... ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారు. సాలీనా 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తూ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ , మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడులోని థర్మల్ పవర్ స్టేషన్ల బొగ్గు అవసరాలను తీర్చడంలో సింగరేణి కీలక భూమిక పోషిస్తున్నదని సీఎం లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో గరిష్ట విద్యుత్ డిమాండ్ జూన్ 2014లో 5 వేల 661 మెగావాట్లు ఉండగా.... 2021 మార్చి నాటికి 13 వేల 688 మెగావాట్లకు పెరిగినందున విద్యుత్ ఉత్పత్తికి నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేయడం చాలా కీలకమని తెలిపారు. సింగరేణిలో బొగ్గు అవసరాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనేక మైనింగ్ లీజులను మంజూరు చేసిందన్నారు. దానికి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com