KCR In Yadadri : యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌..!

KCR In Yadadri : యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌..!
X
KCR In Yadadri : విద్యుత్‌ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న యాదాద్రి క్షేత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సందర్శించారు..

KCR In Yadadri :విద్యుత్‌ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న యాదాద్రి క్షేత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సందర్శించారు.. వరంగల్‌ పర్యటన అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో యాదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్‌.. యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అర్చకులు సీఎం కేసీఆర్‌కు వేద ఆశీర్వచనం అందచేశారు.

బాలాలయంలో ప్రత్యేక పూజల అనంతరం సీఎం కేసీఆర్‌ అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆలయం లోపల అధికారులతో కలిసి కలియతిరిగారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.. విద్యుత్‌ కాంతులతో వెలిగిపోతున్న ఆలయాన్ని చూసి అంతా తన్మయత్వం చెందారు.

సీఎం కేసీఆర్‌ వెంట మంత్రులు, సీఎస్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులున్నారు. అంతకు ముందు కొండ కింద నిర్మిస్తున్న రింగ్‌ రోడ్‌, పుష్కరిణి, నిత్యాన్నదాన సత్రం, సత్యనారాయణ వ్రత మంటపం, బస్‌ స్టాప్‌, కల్యాణ కట్ట సహా పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు.

Tags

Next Story