TG: నేరగాళ్లు ఎవరైనా సక్కగా బొక్కలో వేయండి: రేవంత్

పోలీసులతో అమర్యాదగా ప్రవర్తించేటోళ్లు ఎవరైనా సరే క్షమించేది లేదని సీఎం రేవంత్ హెచ్చరించారు. నేరగాళ్లు రాజకీయ నాయకులైనా, ఎంతటి వారైనా సరే ప్రొటోకాల్ వర్తించదని స్పష్టం చేశారు. ఎవరైనా పోలీస్ స్టేషన్‌కు వచ్చి హడావుడి చేస్తే సక్కగ బొక్కలో వేయాలని పోలీసులను ఆదేశించారు. ‘‘ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా మిమ్మల్ని ఆదేశిస్తున్నా.. పేదలు, సామాన్యులు, బాధితుల పట్ల సానుభూతితో ఉండండి. నేరగాళ్ల విషయంలో మాత్రం కఠినంగా ఉండాలి." నిర్దేశించారు. నేరగాళ్లు ఎంతటి వారైన సరే ప్రొటోకాల్ వర్తించదు” అని రేవంత్ తెలిపారు. నేరగాళ్లకు కూడా మీరు ప్రొటోకాల్ పాటిస్తే ఉద్యోగాలు చేయలేరని పోలీసులతో అన్నారు.
ప్రజాపాలన -విజయోత్సవాల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో హోంశాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క, డీజీపీ జితేందర్ సహా పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్‌డీఆర్‌ఎఫ్)ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ లోగోను ఆవిష్కరించారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌కు సంబంధించిన కొత్త వాహనాలు, బోట్లను జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్ విభాగాలకు చెందిన స్టాల్స్‌ను సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
డ్రగ్స్, సైబర్ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు..
డ్రగ్స్ కట్టడికి కృషి చేయాలని పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ‘‘గత ప్రభుత్వంలో డీజీపీ స్థాయి నుంచి హోంగార్డు స్థాయి అధికారి వరకు రాజకీయ ఒత్తిడి, రాజకీయ ఆదేశాల మేరకు మీ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించారు. కానీ మా ప్రభుత్వంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా, రాజకీయ పైరవీలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికీ వారి సమర్థతను బట్టి హోదా ఇచ్చాం. ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుండా నియమాకాలు జరిపాం. ఈ మధ్య నేరాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. ఒకప్పుడు ఆర్థిక నేరాలు, హత్యలు, అత్యాచారాలను తీవ్రమైన నేరాలుగా పరిగిణించేవాళ్లం.కానీ ఇప్పుడు సైబర్ క్రైమ్, డ్రగ్స్ భారీగా పెరిగిపోతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com