TG: రాచరిక పోకడలు లేని తెలంగాణ తల్లి విగ్రహం

TG: రాచరిక పోకడలు లేని తెలంగాణ తల్లి విగ్రహం
X
తెలంగాణ తల్లి విగ్రహ నమూనా విడుదల.. డిసెంబర్ 9న ఆవిష్కరించనున్న సీఎం

తెలంగాణ సచివాలయం ఆవరణలో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. మొదట ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ చేతుల మీదుగా నిర్వహించాలని భావించినప్పటికీ, ఆమె అనారోగ్య కారణంగా రాలేకపోతున్నారని తెలుస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేట వద్ద ప్రత్యేకంగా రూపొందించారు. ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినట్లు అధికారులు వెల్లడించారు. విగ్రహ రూపులేఖల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఆయన సూచనల మేరకు విగ్రహ నమూనాను సిద్ధం చేసి, అందుకు అనుగుణంగా విగ్రహాన్ని తయారు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీలను కూడా ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణ తల్లికి కొత్త రూపం.. కొత్త విగ్రహం వచ్చేసింది. తెలంగాణ ఆడబిడ్డను గుర్తు చేస్తోంది తెలంగాణ తల్లి విగ్రహం. తెలంగాణ సామాన్య మహిళ రూపం ఆకట్టుకుంటుంది. ఆకు పచ్చ చీరలో దర్శనం ఇస్తుంది తెలంగాణ తల్లి. చేతికి మట్టి గాజులతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిండుదనం తీసుకొచ్చింది తెలంగాణ తల్లి విగ్రహం.

తెలంగాణ తల్లీ విగ్రహంలో మార్పులు ఇవే

గత తెలంగాణ తల్లి విగ్రహం.. జరీ అంచు ఉన్న పట్టుచీర, మెడలో కంటె, బంగారు హారం ఎడమ చేతిలో బతుకమ్మ, కుడి చేతిలో మొక్కజొన్న చేతికి బంగారు గాజులు కాళ్లకు వెండి మెట్టెలు నడుముకు వడ్డాణం ఉండగా.. బంగారు అంచు ఉన్న ఆకుపచ్చ చీర మెడలో కంటె, బంగారు గొలుసు ఎడమ చేతిలో వరి, జొన్న, మొక్క జొన్న, సజ్జ అభయహస్తంగా కుడిచేయి చేతికి ఆకుపచ్చ గాజులు కాళ్లకు మెట్టెలు, పట్టీలు పీఠంలో పిడికిళ్లు పోరాట పటిమను ప్రతిబింబిస్తుంది. తెలంగాణ తల్లి విగ్రహం రూపంలో రాచరికానికి సంబంధించిన ఆనవాళ్లు లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ తల్లి ప్రతిమ రాష్ట్రం యొక్క సంప్రదాయాలు, సంస్కృతి ప్రతిబింబించేలా ఉండేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ప్రభుత్వం కోరింది.

తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ప్రత్యేకతలివే:

ఆకుపచ్చని చీర

ఎడమ చేతిలో వరి కంకి, మొక్క జొన్న కంకి, సజ్జ కంకి

మెడలో తెలంగాణ పల్లె ఆడపడుచులు ధరించే తీగ

చేతికి ఆకుపచ్చ గాజులు

బంగారు రంగు అంచు ఆకుపచ్చ చీర

పోరాట స్ఫూర్తిని తెలిపేలా బిగించిన పిడికిళ్లు

అభయహస్తంతో తెలంగాణకు ఆశీస్సులు

నుదుటన ఎర్రటి కుంకుమ బొట్టు

చెవికి కమ్మలతో తెలంగాణ తల్లి విగ్రహం

Tags

Next Story