REVANTH: కోర్టు విచారణకు హాజరైన సీఎం రేవంత్

REVANTH: కోర్టు విచారణకు హాజరైన సీఎం రేవంత్
X
ఎన్నికల ప్రచార సమయంలో చేసిన ప్రసంగాలపై రేవంత్ పై కేసులు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టులో జరిగిన విచారణకు హాజరయ్యారు. శాసనసభ ఎన్నికల ప్రచారం సమయంలో భాగంగా ఆయన చేసిన ప్రసంగంపై నాటి బీఆర్ఎస్ నేతలు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డిపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌, మెదక్ జిల్లాలోని కౌడిపల్లి, హైదరాబాద్‌లోని బేగం బజార్, తిరుమలగిరి, పెద్దవూర, కమలపూర్‌తోపాటు నల్గొండలో మొత్తం తొమ్మిది కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. గత ఎన్నికల సమయంలో.. రిజర్వేషన్లను బీజేపీ తొలగిస్తుందంటూ.. అప్పుడు టీపీసీసీ ఛీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి వీడియో రిలీజ్ చేశారు. దీనిపై కూడా రేవంత్ పై కేసు నమోదైంది. దీనిపైనా ఇవాళ విచారణ జరిగింది.

తదుపరి విచారణ 23న

సీఎం రేవంత్ కోర్టుకు వస్తుండడంతో.. నాంపల్లిలో కోర్టు వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ఈ కేసు తదుపరి విచారణ మార్చి 23వ తేదీకి వాయిదా వేశారు. ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో ఈ కేసులను నమోదు చేశారని రేవంత్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

హత్య ఘటనపై రేవంత్ సీరియస్

మేడిగడ్డ కుంగుబాటు వ్యవహారంపై కేసు వేసిన భూపాలపల్లికి చెందిన రాజ లింగమూర్తి దారుణ హత్య ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్ అయ్యింది. ఈ కేసు విచారణను సీబీసీఐడీకి అప్పగించాలని నిర్ణయించింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులను రేవంత్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కారణమని లింగమూర్తి కేసు వేసిన సంగతి తెలిసిందే.

నేడు పోలేపల్లికి సీఎం రేవంత్ రెడ్డి రాక

సీఎం రేవంత్ రెడ్డి పోలేపల్లి ఎల్లమ్మ దర్శనం కోసం వస్తున్న నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. రేవంత్ నేడు పోలెపల్లి రానుండడంతో జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా పరిగి డీఎస్పీ శ్రీనివాస్, కొడంగల్ సీఐ శ్రీధర్ రెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరానున్నారు.

Tags

Next Story