REVANTH: ఒక్క ఏడాదే 14 వేల ఉద్యోగాలు... ఇదో రికార్డు: రేవంత్

వైద్య ఆరోగ్య శాఖ బలోపేతం అయితేనే రాష్ట్రం బాగుంటుందని.. అత్యధికంగా డాక్టర్లను అందించే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ లో ఆరోగ్య ఉత్సవాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి 213 అంబులెన్స్ లకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. వైద్య ఆరోగ్య శాఖపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందని అన్నారు. ఇందులో భాగంగానే వైద్య ఆరోగ్యశాఖలో ఒక ఏడాదిలోనే 14వేల నియామకాలు చేపట్టామని.. దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డ్ అని అన్నారు. 75 ఏళ్ళ స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఈ రేంజ్ లో నియామకాలు జరగలేదని సీఎం రేవంత్ అన్నారు . శాఖలపై మంత్రులకు పట్టు ఉంటేనే సమర్థవంతంగా పనిచేయగలరని.. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఎడ్యుకేషన్ పరంగా ఇంజినీర్ అయినప్పటికీ.. సహజంగా ఆయన ఒక డాక్టర్ లాంటివారని అన్నారు. అందుకే ఈ శాఖలోని సమస్యలను త్వరగా గుర్తించి.. పట్టుబట్టి తనతో సంతకాలు చేయించుకున్నారని అన్నారు. మెడికల్ కాలేజీల అడ్మిషన్ ల విషయంలో కాలేజీల అనుమతులకు చాలా కృషి చేశారని, చిత్తశుద్ధి లేకపోతే నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉంటాయి… కానీ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర విజయవంతంగా పనిచేస్తున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉద్యోగ నియామకాలు కోసం యువత ఆనాడు రోడ్ మీదకు వచ్చారని, కానీ పదేళ్లలో భర్తీ చేయలేక పోయారన్నారు.
ఉద్యోగాలు ఇస్తున్నాం..
" నోటిఫికేషన్ ఇస్తే పరీక్ష కాదు.. పరీక్ష నిర్వహిస్తే పేపర్ లీకేజీ… చిత్తశుద్ధి లేదు అని ఆనాడే చెప్పాను… అందుకే వాళ్ల ఉద్యోగాలు ఉడగొట్టినందుకే మీకు ఉద్యోగాలు వచ్చాయి… ఒక్క ఏడాది లో 55 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ కే దక్కుతుంది" అని రేవంత్ అన్నారు… డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కొంతమంది కుట్ర చేసి కొంతమంది అభ్యర్ధులను రెచ్చగొట్టి రోడ్ మీదకు తీసుకొచ్చారు… అయినా కూడా పరీక్ష నిర్వహించామని గుర్తు చేశారు. ఒక్క ఏడాది లో 50 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు.. పరీక్షలు వాయిదా వేస్తే తల్లిదండ్రులకు భారం అవుతారు… ఉద్యోగం వస్తె వారికి అండగా ఉంటారు.
అన్ని యూనివర్సిటీలకు వీసీలు
అన్ని యూనివర్సిటీ లను వీసీ లను నియమించామని.. ఇంకా యూనివర్సిటీల్లో అన్ని టీచింగ్, నాన్ టీచింగ్ నియామకాలు చేపడుతున్నామని రేవంత్ తెలిపారు. విద్య శాఖ నీ అందుకే తానే పర్యవేక్షిస్తున్న.. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా శ్రీమంతులు చేయించుకునే వైద్యాన్ని ప్రతి పేదలకు అందాలని చూశామన్నారు.. ఉచిత వైద్యాన్ని 10 లక్షల రూపాయలకు పెంచుకున్నమన్నారు. సిఎంఆర్ఎఫ్ లో 835 కోట్ల ను ఖర్చు చేశామన్నారు. ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని రేవంత్ గుర్తు చేశారు.. ఆర్టీసీ బస్సులో అణపైశా లేకుండా ప్రయాణం చేస్తున్నామన్నారు. ఇందుకోసం 3800 కోట్లు రూపాయలు కేటాయించం.. 500 రూపాయలకు 50 లక్షల కుటుంబాలు వినియోగిస్తున్నాయన్నారు .
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com