TS: ముగిసిన రేవంత్‌ దావోస్‌ పర్యటన

TS: ముగిసిన రేవంత్‌ దావోస్‌ పర్యటన
తెలంగాణకు 37 వేల కోట్ల పెట్టుబడులు.... అదానీ గ్రూప్ నుంచి అత్యధిక పెట్టుబడులు

పెట్టుబడుల వేటే లక్ష్యంగా మూడు రోజులపాటు సాగిన తెలంగాణ ముఖ్యమంత్రి దావోస్‌ పర్యటన ముగిసింది. రైతులను ధనికులను చేయడమే లక్ష్యమన్న రేవంత్‌రెడ్డితో ఇప్పటివరకూ సుమారుగా 37వేల కోట్ల పైచిలుకు రూపాయలతో పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి. అదానీ గ్రూప్‌ సంస్థలు అత్యధికంగా పెట్టుబడులు పెట్టడానికి మెుగ్గు చూపగా... వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖ పారిశ్రామిక సంస్థలు సైతం రాష్ట్రంలో పెట్టుబడులకు అంగీకరించాయి. పెట్టుబడుల సాధనే ధ్యేయంగా ముఖ్యమంత్రి బృందం దావోస్‌ పర్యటన సాగింది. 37వేల కోట్ల రూపాయలకు పైగా పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి. హైదరాబాద్‌లో యూకేకి చెందిన సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్... 231 కోట్ల రూపాయలతో వైద్య పరికరాల తయారీ పరిశ్రమ నెలకొల్పనుంది. ఈ మేరకు.. గురువారం దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంస్థ ఎండీ గౌరి శ్రీధర, డైరెక్టర్‌ అమర్ చర్చల అనంతరం ఒప్పందం కుదిరింది. ఈ సంస్థ... మొదటి దశలో సర్జికల్, ఆర్థోపెడిక్ , ఆఫ్తమాలిక్ పరికరాల తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. రెండో దశలో... రొబొటిక్ వైద్య పరికరాలను తయారు చేయనుంది.


సమాజానికి ఎంతో సాయం చేస్తున్న రైతులకు ప్రపంచమంతా అండగా నిలవాల్సిన సమయం వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పేర్కొన్నారు. అన్నదాతలకు కార్పొరేట్ సంస్థల తరహాలో లాభాలు వస్తే.. ఆత్మహత్యలు ఉండవన్నారు. రైతులకు కనీస మద్దతు ధరకన్నా ఎక్కువ లాభాలు రావాలన్నది తన స్వప్నమని దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ పేర్కొన్నారు. దావోస్‌ పర్యటన అనంతరం లండన్‌లో మూడు రోజులు పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం.. పారిశ్రామికవేత్తలతో చర్చించనుంది. థేమ్స్ నది అభివృద్ధి, పర్యాటకంపై అధ్యయనం చేయనుంది.


మరోవైపు సమాజానికి ఎంతో సాయం చేస్తున్న రైతులకు ప్రపంచమంతా అండగా నిలవాల్సిన సమయం వచ్చిందని రేవంత్‌రెడ్డి అన్నారు. అన్నదాతలకు కార్పొరేట్‌ తరహా లాభాలు వస్తే ఆత్మహత్యలు ఉండవన్నారు. రైతులకు లాభాలు రావాలన్నది తన స్వప్నమని దావోస్‌లో వెల్లడించారు. ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో భాగంగా ‘ఫుడ్‌ సిస్టమ్‌ అండ్ లోకల్‌ యాక్షన్‌’ అనే అంశంపై రేవంత్‌ మాట్లాడారు.


భారతదేశంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. రైతుల ఆత్మహత్యలు అతిపెద్ద సమస్యగా మారాయని... బ్యాంకు రుణాలు రాక.. ఆధునిక సాంకేతిక పద్ధతులు అందుబాటులో లేకపోవడంతో రైతులు సరైన లాభాలు పొందలేకపోతున్నారని రేవంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేను వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలు అర్థం చేసుకోగలను. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం.. రైతు ప్రభుత్వం. అన్నదాతలకు నేరుగా పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా కార్యక్రమం అమలు చేస్తున్నామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story