REVANTH: కాలకేయ ముఠా నుంచి కాపాడుకుందాం

REVANTH:   కాలకేయ ముఠా నుంచి కాపాడుకుందాం
X
రాజీవ్‌ విగ్రహాన్ని ముట్టుకుంటే ఖబడ్దార్‌... సీఎం రేవంత్‌ రెడ్డి మండిపాటు

తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన రేవంత్‌రెడ్డి.. బీఆర్‌ఎస్‌ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఇచ్చింది.. రాష్ట్రాన్ని కాపాడేది తామే అని రేవంత్ చెప్పారు. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ముట్టి చూడండి బిడ్డా.. ఎవడు వస్తాడో రండి.. నేను చూస్తా అంటూ ముఖ్యమంత్రి మండిపడ్డారు. కాలకేయ ముఠా, మీడతల దండు నుంచి తెలంగాణను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. కేటీఆర్‌పై రేవంత్‌ పరోక్ష విమర్శలు చేశారు. రోజూ ‘ఎక్స్‌’లో పోస్టులు పెడుతున్న ఒకాయన అమెరికాకు వెళ్లి సాఫ్ట్‌వేర్‌ విద్య చదివా అంటున్నారని... కంప్యూటర్‌ను దేశానికి పరిచయం చేసిందే రాజీవ్‌గాంధే అని గుర్తు చేశారు. రాజీవ్‌ వల్లే ఐటీ మంత్రివి అయ్యావని.. వెయ్యి ఎకరాల్లో మీరు ఫామ్‌ హౌస్‌ ఏర్పాటుచేసుకున్నారని.. 100 ఎకరాల్లో జన్వాడలో ఫామ్‌ హౌస్‌ కట్టుకున్నారన్నారు. కానీ పది ఎకరాల్లో ప్రగతిభవన్‌ పేరు మీద గడీని నిర్మించుకున్నారని.... వాస్తు చక్కగా లేదని కొత్త సచివాలయం కట్టుకున్నారు.. రూ.లక్ష కోట్లు దిగమింగి.. కాళేశ్వరం నిర్మించారని... తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడానికి మీకు పదేళ్లు సరిపోలేదా అని రేవంత్‌ ప్రశ్నించారు. తాము ఇక్కడ రాజీవ్‌గాంధీ విగ్రహం అనగానే.. తెలంగాణ తల్లి గుర్తొచ్చిందా? అని నిలదీశారు.

పాల్గొన్న మంత్రులు

తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్‌ బాబు, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి క్రిష్ణారావు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మిగతా మంత్రివర్గ సహచరులతో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

ఏమిటీ వివాదం

రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రదేశంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రదేశంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. సచివాలయం లోపల ప్రధానమైన ద్వారం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు ఇటీవలే భూమి పూజ కూడా చేసారు. డిసెంబర్​ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు.

Tags

Next Story