TG: కులగణనను ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటాం: రేవంత్ రెడ్డి

తెలంగాణలో కులగణనను ప్రభుత్వం బాధ్యతగా భావిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సామాన్య ప్రజల నుంచి సూచనలు తీసుకోవడానికి రాహుల్‌గాంధీ రాష్ట్రానికి రావడం గొప్ప విషయమని కొనియాడారు. కులగణన విషయంలో రాహుల్‌కు ఇచ్చిన మాట నెరవేర్చడమే తమ కర్తవ్యమన్నారు. కులగణన మాటల్లో కాదు.. చేతల్లో చూపాలన్నదే ఆయన ఆలోచన అని తెలిపారు. బీసీలకు అందాల్సిన రిజర్వేషన్లు కులగణనతో అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కులగణన మాటల్లో కాదు.. చేతల్లో చూపాలన్నదే ఆయన ఆలోచన అని తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవాలంటే గుండె ధైర్యం కావాలని సీఎం రేవంత్ కామెంట్ చేశారు. విద్య, వైద్యం, ఉద్యోగం, సామాజిక న్యాయం ప్రజలకు అందించాలని రాహుల్ గాంధీ అడుగు ముందుకు వేశారని, రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నెరవేర్చడమే మన కర్తవ్యమన్నారు. సామాజిక బాధ్యత, సమాన అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. బీసీకు అందాల్సిన రిజర్వేషన్లు కులగణనతో అందిస్తామని స్పష్టం చేశారు. 2025లో చేపట్టబోయే జనగణనలో కులగణనను కూడా పరిగణలోకి తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
గ్రూప్ వన్ పై రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీవో 29 వివాదం చెలరేగిన వేళ.. రాహుల్ సభలో రేవంత్ స్పష్టత ఇచ్చారు. గ్రూప్ 1 మెయిన్స్ కు 31,383 మంది ఎంపికయ్యారని, ఇందులో ఓసీలు-3076 (9.8%), ఈడబ్ల్యూఎస్- 2774 (8.8%), ఓబీసీలు-17,921(57.11%), ఎస్సీలు-4828 (15.3%), ఎస్టీలు-2783 (8.8%) ఉన్నారని అన్నారు. ఇది తమ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. మనది రైజింగ్ తెలంగాణ అని వ్యాఖ్యానించారు. దేశానికి రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను అమలు చేయడం మన కర్తవ్యమన్నారు రేవంత్ రెడ్డి. కులగణన పూర్తి చేసి బీసీలకు న్యాయంగా అందాల్సిన రిజర్వేషన్లు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. కులగణనను 2025 జనగణనలో పరిగణనలోకి తీసుకోవాలని ఈ వేదికపై తీర్మానం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
రాహుల్ గాంధీకి ఘన స్వాగతం
సమగ్ర కులగణనపై మేధావులు, విద్యార్థులు, నేతలు, యువత, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకునేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఘన స్వాగతం పలికారు. గాంధీ ఐడియాలజీ సెంటర్ లో నిర్వహించే సభకు మొత్తం 400 మందికి ఆహ్వానం అందింది. కులగణనపై మార్పులు, చేర్పులు సహా సలహాలను రాహుల్ గాంధీ స్వీకరించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com