REVANTH: మోదీ చేస్తే ఒప్పు.. మేం చేస్తే తప్పా..?

తెలంగాణలో బీజేపీ నేతల విధానాలపై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళనపై కమలం నేతల ద్వంద్వ వైఖరిపై మండిపడ్డారు. ‘‘ప్రధాని మోదీ గుజరాత్‌లో సబర్మతిని బాగుచేసినా, రూ.40 వేల కోట్లు పెట్టి గంగానదిని ప్రక్షాళన చేసినా.. ఆ విషయాన్ని బీజేపీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారని.. కానీ తాము మూసీ ప్రక్షాళన చేస్తామంటే మాత్రం అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అవినీతికి పాల్పడుతున్నానంటూ కొందరు దొంగ బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇయ్యాల సంగెం రావడంతో తన జన్మధన్యమైందన్న రేవంత్... సంగెం శివయ్యను దర్శించుకుని మూసీని ప్రక్షాళన చేయాల్సిందేనని సంకల్పం తీసుకున్నానని వెల్లడించారు.
మీలా దోపిడీ చేసేందుకు రాలే..
రూ.లక్ష కోట్లతో ప్రాజెక్టులు కట్టి దోచుకోవడానికి తాను రాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ ప్రాజెక్టు కోసం రూ.లక్షా 50 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని, అందులో రూ.25 వేల కోట్లు రేవంత్ రెడ్డి దోచుకుంటున్నాడని కొందరు ఆరోపిస్తున్నారని గుర్తు చేశారు. దోచుకోవాలని అనుకుంటే.. నల్గొండ, రంగారెడ్డి ప్రజలను ముంచాలా? మీలెక్క ధరణిని అడ్డం పెట్టుకుని కోకాపేటలో 100 ఎకరాలు కబ్జా పెడితే రూ.10 వేల కోట్లు వస్తయ్. 500 ఎకరాల భూమిని అబ్రకదబ్ర చేస్తే రూ.50 వేల కోట్లు వస్తయ్. మీరు భూములు మాయం చేసినట్టు అటు ఇటు చేసి దోపిడీ చేయలేమా?’’ అని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి అన్నారు. తాను అలా దోచుకోవడానికి రాలేదని చెప్పారు. ఎవరి దయాదాక్షిణ్యాలతో తాను సీఎం కుర్చీలో కూర్చోలేదని, జనమే తమ పార్టీ ఎమ్మెల్యేలను భారీ మెజార్టీతో గెలిపించారని గుర్తు చేశారు.
కేసీఆర్ పట్టించుకోలేదు
మూసీ పరివాహక ప్రాంత ప్రజలను మాజీ సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘మూడు నెలలు నీ బిడ్డ జైలుకు పోతే నీకు దుఃఖం వచ్చింది. కానీ మూసీ పరివాహక బిడ్డల జీవితాలే పోతుంటే నీకు పట్టదా?’’ అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ‘కేసీఆర్.. నల్గొండ ప్రజలు నీకు ఓట్లు వేయలేదా? మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని చూస్తున్నావ్. నల్గొండ జిల్లా పౌరుషాల గడ్డ.. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే మూసీలోనే పాతరేస్తారు” అని హెచ్చరించారు. అవినీతి, దోపిడీ కోసం మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని చూస్తున్నారని, ఎవరెన్ని చేసినా మూసీ పునరుజ్జీవం జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. కానీ మూసీ పరివాహక బిడ్డల జీవితాలే పోతుంటే నీకు పట్టదా? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని చూస్తున్నవ్. నల్గొండ జిల్లా పౌరుషాల గడ్డ.. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటేమూసీలోనే పాతరేస్తరన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com