REVANTH: మూసీ ప్రక్షాళన చేయకపోతే నా జన్మే దండగ

REVANTH: మూసీ ప్రక్షాళన చేయకపోతే నా జన్మే దండగ
X
అడ్డొస్తే బుల్డోజర్లతో తొక్కిస్తా.. మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రలో రేవంత్ భావోద్వేగం

కమీషన్ల కోసమే మూసీ ప్రాజెక్టు చేపట్టానని గులాబీ పార్టీ అంటోందని.. ఈ మూసీని ప్రక్షాళన చేయకపోతే తన జన్మే దండగ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర చేట్టిన రేవంత్.. ధర్మారెడ్డి పల్లి గూడెంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో మూసీ ప్రక్షాళన చేసి తీరతానని శపథం చేశారు. బుల్డోజర్లకు అడ్డంగా నిలబడాలనుకునే వారు పేర్లు ఇవ్వాలని, వాళ్ల పై నుంచి బుల్డోజర్లను నడిపిస్తానని హెచ్చరించారు. మూసీకి అడ్డువస్తే కుక్కచావు చస్తారన్నారు. బీఆర్ఎస్ వాళ్లు అడ్డొస్తే.. వాళ్ల నడుముకి తాడు కట్టి మూసీలో ప్రజలు ముంచుతారన్నారు. మూసీ నది విషంగా మారిందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ నల్గొండ ప్రాంతానికి ఒకనాడు వరం అని, ప్రస్తుతం నల్గొండను ఓ వైపు ఫ్లోరైడ్, మరోవైపు మూసీ పీడిస్తోందని చెప్పారు.


పాలు, మాంసం కొనే పరిస్థితి లేదు

మూసీ పరివాహక ప్రాంతంలో గౌడన్నలు కల్లు అమ్ముకునే పరిస్థితి లేదని, మూసీ నదిఒడ్డున పెంచే గొర్రె మాంసాన్ని కొనే పరిస్థితి లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన చెందారు. ఇక్కడ గేదె, ఆవు పాలను కొనే పరిస్థితి లేదని తెలిపారు. బాధిత రైతుల బాధలు స్వయంగా తెలుసుకున్నానని, మూసీ కింద కూరగాయ రైతులు వ్యవసాయం బంద్ చేసుకున్నారని సీఎం చెప్పారు. ఇక్కడ నుంచి ప్రతి కులవృత్తి వలస వెళ్లిందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. బీఆర్ఎస్ కు దోచుకోవడమే తప్ప మేలు చేయడం తెలియదని గత పాలకుల నిర్లక్ష్యంపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ నది హైదరాబాద్ కు అణుబాంబు కంటే ప్రమాదం అని రేవంత్ రెడ్డి చెప్పారు. మన నగరాన్ని విధ్వంసం చేస్తుంటే రాజకీయాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. మూసీ నది వరంగా మారాల్సింది శాపంగా మారితే బాగుచేయొద్దా అని సీఎం నిలదీశారు.

కేసీఆర్ పట్టించుకోలేదు

మూసీ పరివాహక ప్రాంత ప్రజలను మాజీ సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘మూడు నెలలు నీ బిడ్డ జైలుకు పోతే నీకు దుఃఖం వచ్చింది. కానీ మూసీ పరివాహక బిడ్డల జీవితాలే పోతుంటే నీకు పట్టదా?’’ అని కేసీఆర్​ను ప్రశ్నించారు. ‘కేసీఆర్.. నల్గొండ ప్రజలు నీకు ఓట్లు వేయలేదా? మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని చూస్తున్నావ్. నల్గొండ జిల్లా పౌరుషాల గడ్డ.. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే మూసీలోనే పాతరేస్తారు” అని హెచ్చరించారు. అవినీతి, దోపిడీ కోసం మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని చూస్తున్నారని, ఎవరెన్ని చేసినా మూసీ పునరుజ్జీవం జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. కానీ మూసీ పరివాహక బిడ్డల జీవితాలే పోతుంటే నీకు పట్టదా? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని చూస్తున్నవ్. నల్గొండ జిల్లా పౌరుషాల గడ్డ.. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటేమూసీలోనే పాతరేస్తరన్నారు.

Tags

Next Story