TG: స్వగ్రామంలో రేవంత్ అభివృద్ధి పనులు

స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు. గ్రామంలోని కోట మైసమ్మను దర్శించుకుని జమ్మిచెట్టుకు సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, అంతకముందు గ్రామంలో రూ.72 లక్షలతో నిర్మించిన కొత్త పంచాయతీ భవనం, రూ.55 లక్షలతో అమర జవాను యాదయ్య స్మారక గ్రంథాలయం, రూ.45లక్షలతో బీసీ సామాజిక భవనం, రూ.45 లక్షలతో చేపట్టిన పశు వైద్యశాల భవనాలను సీఎం ప్రారంభించారు. కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధికి ఇప్పటికే ప్రభుత్వం రూ.30 కోట్లు మంజూరు కాగా.. మరో రూ.170 కోట్ల పనులకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు ప్రభుత్వానికి పంపించారు. ఇప్పటికే.. కొండారెడ్డిపల్లిలో సుమారు రూ.72 లక్షలు పెట్టి గ్రామపంచాయతీ భవనం నిర్మించగా.. దానికి రేవంత్ రెడ్డి తండ్రి అయిన ఎనుముల నరసింహారెడ్డి పేరు పెట్టారు.
కేంద్ర పథకం కూడా ఇక్కడి నుంచే..
రాష్ట్రంలో చేపట్టబోయే కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ను ముందుగై తన కొండారెడ్డిపల్లిలోనే ప్రాంరభించేందుకు కసరత్తు కూడా చేస్తున్నారు. రాష్ట్రంలోనే పూర్తి సోరరైజ్డ్ గ్రామంగా కొండారెడ్డిపల్లిని తీర్చిదిద్దలన్న భావనతో.. అక్కడే పైలెట్ ప్రాజెక్టు మొదలుపెట్టారు. అందులో భాగంగానే.. సెప్టెంబర్ నెలలో అధికారులు సర్వే కూడా చేశారు. కొండారెడ్డిపల్లిలో సుమారు 499 గృహ వినియోగదారులు, 66 కమర్షియల్ కస్టమర్లతో పాటు 867 వ్యవసాయ వినియోగదారులు, ఇతర కేటగిరిలతో కలుపుకుని మొత్తంగా 1451 విద్యుత్ వినియోగదారులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటికే.. ఇండ్లకు రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.
పూజల్లో పాల్గొన్న సీఎం
అభివృద్ధి పనుల ఆరంభం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తన నివాసానికి వెళ్లారు. నివాసంలో కుటుంబసభ్యులు, బంధువులతో కొన్ని గంటల పాటు గడిపారు. సాయంత్రం నివాసం నుంచి గ్రామ శివారులోని జమ్మి చెట్టు వద్దకు ర్యాలీగా వెళ్ళారు.అనంతరం మనవడితో కలిసి జమ్మి పూజలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడి నుంచి నేరుగా ఆంజనేయ స్వామి ఆలయంలో మరోసారి పూజలు నిర్వహించారు. అనంతరం సీఎంను గ్రామస్తులు కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులను పలకరిస్తూ వారితో ఫోటోలు దిగారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com