భట్టి పీపుల్స్‌ మార్చ్‌కు గద్దర్‌, సంపత్‌ కుమార్‌ సంఘీభావం

భట్టి పీపుల్స్‌ మార్చ్‌కు గద్దర్‌, సంపత్‌ కుమార్‌ సంఘీభావం
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పాలమూరు జిల్లాలో తిరిగి ప్రారంభమైంది

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పాలమూరు జిల్లాలో తిరిగి ప్రారంభమైంది. 68వ రోజు జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం రక్కుంపల్లి నుంచి మల్లారెడ్డిపల్లి మీదుగా పాదయాత్ర జోరుగా కొనసాగుతోంది. భట్టి పీపుల్స్ మార్చ్‌కు ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ప్రజా గాయకుడు గద్దర్ సంఘీభావం తెలిపారు. పాదయాత్రలో భాగంగా భట్టి విక్రమార్క ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అంతకుముందు స్వల్ప అస్వస్థతకు గురైన భట్టి విక్రమార్క.. ఈనెల 18 నుంచి ఐదు రోజుల పాటు పాదయాత్రకు విరామం ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story