TPCC: కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 45మందితో రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. అనేక తర్జనభర్జనలు, సామాజిక సమీకరణాల మేరకు రెండో జాబితాను అధిష్ఠానం ప్రకటించింది. ఇప్పటికే తొలి జాబితాలో 55 పేర్లు ప్రకటించిన కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కలిసి మరో 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మునుగోడు టికెట్ ఇవాళ పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఇవ్వగా LB నగర్ నుంచి మధు యాష్కికి అవకాశం ఇచ్చారు. ఖమ్మం టికెట్‌ను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు పాలేరు టికెట్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కేటాయించారు.
జూబ్లీహిల్స్ నుంచి అజారుద్దీన్., ఖైరతాబాద్ నుంచి పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి గద్దర్ కుమార్తె వెన్నెలకు మలి జాబితాలో చోటు దక్కింది. వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ, వరంగల్ వెస్ట్ టికెట్‌ను నాయిని రాజేందర్‌రెడ్డికి కేటాయించారు. ఎనిమిది నియోజక వర్గాలకు బీసీలను, మూడు స్థానాలకు చౌదరిలను, రెండు స్థానాలకు వెలమలు, ఒక్కటి బ్రాహ్మణ, ఎస్సీలకు మూడు, ఎస్టీలకు ఆరు, ఒక్కటి ముస్లింలకు టికెట్లు దక్కాయి. ఎనిమిది మంది బీసీల్లో పద్మశాలి-1, ముదిరాజ్-2, గౌడ్లు-3, మున్నూరుకాపు-1, ఎంబీసీ-1 లెక్కన ఉన్నాయి. మొత్తం 45 మందిలో నాలుగు సీట్లు మాత్రమే మహిళలకు దక్కాయి.
రెండో జాబితాలో పలువురికి అవకాశం కల్పించింది. ఖమ్మం జిల్లాలో ఖమ్మం టికెట్‌ను తుమ్మల నాగేశ్వరరావుకు, పాలేరు బరిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిలవనున్నారు. పినపాక నుంచి పొంగులేటి అనుచరుడు పాయం వెంకటేశ్వర్లు టికెట్ దక్కించుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకుర్తి స్థానం యశస్విని, మహబూబూబాద్ మురళి నాయక్ దక్కించుకున్నారు. వరంగల్ పశ్చిమ నుంచి నాయిని రాజేందర్‌రెడ్డి, వరంగల్ తూర్పు స్థానంలో కొండా సురేఖ బరిలో దిగనున్నారు. వర్ధన్నపేటలో కె.ఆర్.నాగరాజు, జనగామ బరిలో ప్రతాప్‌రెడ్డి నిలవనున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి గద్దర్ కుమార్తె వెన్నెలకు అవకాశం ఇచ్చారు. జూబ్లీహిల్స్ అజారుద్దీన్, ఖైరతాబాద్- విజయారెడ్డి, అంబర్ పేట్- రోహిన్ రెడ్డి, శేరిలింగంపల్లి- జగదీశ్వర్ గౌడ్, కూకట్‌పల్లి నుంచి బండి రమేష్ బరిలోకి దింపింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తాండూరు మనోహర్ రెడ్డి, రాజేంద్రనగర్, కస్తూరి నరేందర్, మహేశ్వరం- కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్- మధుయాష్కి, ఇబ్రహింపట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డికి టికెట్ కేటాయించారు. ఉమ్మడి మెదక్ జిల్లా లో దుబ్బాక –చెరకు శ్రీనివాస్ రెడ్డి, నర్సాపూర్- ఆవుల రాజిరెడ్డి, సిద్దిపేట లో పూజల హరికృష్ణ అవకాశం ఇచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ పోటీ చేయనుండగా.. హుజూరాబాద్- ప్రణవ్, చొప్పదండి- మేడిపల్లి సత్యం, కోరుట్ల స్థానాన్ని జువ్వాడి నరసింగరావు కు కేటాయించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ రూరల్ - భూపతి రెడ్డి, ఎ్లలారెడ్డి- మదన్‌మోహన్ రావుకు అవకాశం ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనిముథోల్ స్థానంలో నారాయణరావు పటేల్, బోథ్- వెన్నెల అశోక్, ఆదిలాబాద్-కందిశ్రీనివాసరెడ్డి , సిర్పూర్-రావి శ్రీనివాస్, ఆసిఫాబాద్- అజ్మీరా శ్యామ్, ఖానాపూర్ నుంచి వేడ్మా బొజ్జు బరిలోకి దిగనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com