TPCC: తెలంగాణ కాంగ్రెస్‌లో డబుల్ టికెట్ కోసం నేతల డిమాండ్లు

TPCC: తెలంగాణ కాంగ్రెస్‌లో డబుల్ టికెట్ కోసం నేతల డిమాండ్లు

తెలంగాణ కాంగ్రెస్‌ను డబుల్ టికెట్ల ట్రబుల్ పట్టి పీడిస్తోంది. ఫ్యామిలీలో మరో టికెట్ కోసం నేతల డిమాండ్లు పెరిగిపోయాయి. నాకు, నా కొడుక్కు... నాకు, నా భార్యకు.. నాకు, నా కూతురుకు..అంటూ ఫ్యామిలీలో డబుల్‌ టికెట్ల కోసం నేతలు లాబీయింగ్ చేస్తున్నారు. ఐతే.. ఒక్కో కుటుంబానికి రెండు టికెట్ల డిమాండ్లపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్ల కేటాయింపులో ఫ్యామిలీ ప్యాక్ వద్దే వద్దంటున్నారు. ఒక్క ఫ్యామిలీకి ఒకే టికెట్‌గా నిర్ణయించిన ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కుటుంబానికి రెండు టికెట్లు అడుగుతున్న వారిలో ఉత్తంకుమార్ రెడ్డి, జానారెడ్డి కొండా, సురేఖ.. బలరాం నాయక్, సీతక్క, దామోదర రాజనర్సింహ ఉన్నారు. ఉత్తమ్ ఫ్యామిలీలో భార్య, భర్తకు ఇద్దరికీ టికెట్ డిమాండ్ చేస్తున్నారు. తన ఇద్దరు కొడుకులకు టికెట్ కావాలంటున్నారు జానారెడ్డి. సీతక్క, బలరాం నాయక్‌ తమ కొడుకులకు టికెట్ కావాలంటున్నారు. కొండా మురళి దంపతులు కూడా టికెట్ రేసులో ఉన్నారు.

దామోదర్ రాజనర్సింహ తన కూతురుకు టికెట్ కావాలంటున్నారు. అంజన్‌ కుమార్‌ యాదవ్ మాత్రం ఏకంగా.. తనకు.. తన ఇద్దరు కొడుకులకు టికెట్ కావాలంటున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరాలనుకునే వారు సైతం రెండు టికెట్లు డిమాండ్ చేస్తున్నారు. తమకు రెండేసి టికెట్లు కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్... మైనంపల్లి హనుమంతరావు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో డబుల్‌ ట్రబుల్‌ను ఎలా త్పపించుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్‌ పెద్దలు ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story