తెలంగాణలో కొనసాగుతోన్న కరోనా విజృంభణ.. కొత్తగా..

తెలంగాణలో కొనసాగుతోన్న కరోనా విజృంభణ.. కొత్తగా..
తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా... 18 వందల 91 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య..

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా... 18 వందల 91 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2 లక్షల 8 వేలు దాటినట్టు... వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. కరోనాతో నిన్న ఒక్క రోజులో కరోనాతో ఏడుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 12 వందల 8కి చేరింది. కరోనా నుంచి నిన్న ఒక్కరోజులో... 18 వందల 78 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య ఒక లక్షా 80 వేల 953కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 26 వేల 374 యాక్టివ్‌ కేసులు ఉండగా... వీరిలో.. 21 వేల 801 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్క రోజులో.. 53 వేల 86 పరీక్షలు నిర్వహించగా... ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 34 లక్షల 49 వేల 925 టెస్టులు నిర్వహించినట్టు.. హెల్త్ బులెటిన్‌లో ప్రభుత్వం పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story