TELANGANA: అమ్మ భాషకు పట్టాభిషేకం

TELANGANA: అమ్మ భాషకు పట్టాభిషేకం
X
1 నుంచి 10 వరకు తెలుగు తప్పనిసరి... తెలుగు భాషపై సంచలన నిర్ణయం... అమల్లోకి తెలుగు తప్పనిసరి చట్టం 2018

తెలుగు భాషకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. కవులు, రాజులు, పండితులు పోషించిన సాహిత్య సంపదతో ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందిన భాషగా తెలుగు నిలిచింది. “దేశ భాషలందు తెలుగు లెస్స” అని కీర్తించబడిన ఈ మాధుర్య భాష కేవలం సంభాషణ సాధనం మాత్రమే కాదు; అది మన సంస్కృతి, సంప్రదాయాలు, భావోద్వేగాలు, జీవన విధానాన్ని ప్రతిబింబించే అద్దం. తల్లి లాంటి ఈ భాషను రక్షించడం, భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ తరాల ప్రయోజనం దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలల్లో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలని సంకల్పించింది.

అన్ని పాఠశాలల్లో....

ఇప్ప­టి వరకు తె­లు­గు బోధన ప్ర­ధా­నం­గా రా­ష్ట్ర సి­ల­బ­స్ పా­ఠ­శా­ల­ల్లో మా­త్ర­మే పరి­మి­త­మై ఉం­డే­ది. అయి­తే రా­ష్ట్రం­లో పని­చే­స్తు­న్న సీ­బీ­ఎ­స్ఈ, ఐసీ­ఎ­స్ఈ, ఐబీ వంటి జా­తీయ, అం­త­ర్జా­తీయ బో­ర్డు­ల­కు అను­బం­ధం­గా ఉన్న అనేక ప్రై­వే­ట్ మరి­యు కా­ర్పొ­రే­ట్ పా­ఠ­శా­ల­ల్లో తె­లు­గు బోధన ని­ర్ల­క్ష్యా­ని­కి గు­ర­య్యిం­ది. కొం­త­మం­ది వి­ద్యా­సం­స్థ­లు వి­ద్యా­ర్థు­ల­కు ఎక్కువ మా­ర్కు­లు వచ్చే అవ­కా­శం ఉం­ద­ని భా­విం­చి, రెం­డో భా­ష­గా అర­బి­క్, సం­స్కృ­తం వంటి భా­ష­ల­ను ఎం­పిక చే­సు­కు­నే­లా ప్రో­త్స­హి­స్తు­న్నా­యి. ఫలి­తం­గా చాలా మంది వి­ద్యా­ర్థు­లు తమ మా­తృ­భా­ష­పై పట్టు­ను కో­ల్పో­తు­న్నా­రు. పదో తర­గ­తి పూ­ర్తి చే­సిన వి­ద్యా­ర్థు­ల­లో కొం­ద­రు తె­లు­గు­లో పూ­ర్తి వా­క్యా­లు కూడా సరి­గ్గా చద­వ­లే­ని పరి­స్థి­తి ఏర్ప­డిం­ది. ఇది భాషా పరి­ర­క్షణ దృ­ష్ట్యా ఆం­దో­ళ­న­కర వి­ష­యం. ఈ నే­ప­థ్యం­లో ప్ర­భు­త్వం తె­లు­గు తప్ప­ని­స­రి అమలు చట్టం–2018ను అమ­ల్లో­కి తీ­సు­కు­వ­చ్చిం­ది. 2018-19 వి­ద్యా సం­వ­త్స­రం నుం­డి దశ­ల­వా­రీ­గా ఈ వి­ధా­నా­న్ని అమలు చే­స్తూ వస్తోం­ది. మొ­ద­ట­గా 1వ మరి­యు 6వ తర­గ­తు­ల్లో తె­లు­గు­ను తప్ప­ని­స­రి చే­సిం­ది. అనం­త­రం ప్ర­తి ఏడా­ది ఒకో తర­గ­తి­కి వి­స్త­రి­స్తూ 2022-23 నా­టి­కి 1 నుం­డి 10వ తర­గ­తి వరకు పూ­ర్తి­గా అమలు చే­యా­ల­నే లక్ష్యా­న్ని ని­ర్ణ­యిం­చిం­ది. అయి­తే కరో­నా మహ­మ్మా­రి కా­ర­ణం­గా పా­ఠ­శా­ల­లు సక్ర­మం­గా నడ­వ­క­పో­వ­డం, ఆన్‌­లై­న్ బోధన పరి­మి­తు­లు వంటి కా­ర­ణాల వల్ల 9వ, 10వ తర­గ­తు­ల­కు కొంత సడ­లిం­పు ఇచ్చా­రు.

తాజా ని­ర్ణ­యం ప్ర­కా­రం 2025-26 వి­ద్యా సం­వ­త్స­రం­లో 9వ తర­గ­తి వి­ద్యా­ర్థు­ల­కు, 2026-27లో 10వ తర­గ­తి వి­ద్యా­ర్థు­ల­కు అమలు వి­ష­యం­లో కా­ల­ప­రి­మి­తి సడ­లిం­పు ఉం­టుం­ది. కానీ 2026-27 వి­ద్యా సం­వ­త్స­రం నుం­డి మా­త్రం రా­ష్ట్రం­లో­ని అన్ని రకాల పా­ఠ­శా­ల­ల్లో 1వ తర­గ­తి నుం­డి 10వ తర­గ­తి వరకు తె­లు­గు­ను కచ్చి­తం­గా బో­ధిం­చా­ల్సి ఉం­టుం­ది. ఈ ఆదే­శా­లు ప్ర­భు­త్వ, ప్రై­వే­ట్, కా­ర్పొ­రే­ట్, రె­సి­డె­న్షి­య­ల్, అం­త­ర్జా­తీయ పా­ఠ­శా­ల­ల­న్నిం­టి­కీ వర్తి­స్తా­యి. ఇంకా ఒక ము­ఖ్య అంశం ఏమి­టం­టే, సీ­బీ­ఎ­స్ఈ, ఐసీ­ఎ­స్ఈ, ఐబీ వంటి బో­ర్డుల పా­ఠ­శా­లల కోసం కఠి­న­మైన పా­ఠ్య­పు­స్త­కాల బదు­లు­గా సు­ల­భ­మైన “వె­న్నెల” సి­రీ­స్ పు­స్త­కా­ల­ను ప్ర­వే­శ­పె­ట్టిం­ది ప్ర­భు­త్వం. ఈ పు­స్త­కా­లు ఇతర మా­ధ్య­మా­ల్లో చదు­వు­తు­న్న వి­ద్యా­ర్థు­ల­కు సు­ల­భం­గా అర్థ­మ­య్యే­లా రూ­పొం­దిం­చారు. తె­లు­గు నే­ర్చు­కో­వ­డం కష్ట­మ­నే భావన తొ­ల­గిం­చి, భా­ష­పై ఆస­క్తి పెం­చ­డ­మే లక్ష్యం­గా పా­ఠ్యాం­శా­ల­ను రూ­పొం­దిం­చా­రు. ఎస్‌­సీ­ఈ­ఆ­ర్‌­టీ రూ­పొం­దిం­చిన పా­ఠ్య­పు­స్త­కా­ల­ను అన్ని పా­ఠ­శా­ల­లు తప్ప­ని­స­రి­గా వి­ని­యో­గిం­చా­ల్సి ఉం­టుం­ది.

Tags

Next Story