మంత్రి జగదీష్‌రెడ్డి సారథ్యంలో లక్ష జనహారతి

మంత్రి జగదీష్‌రెడ్డి సారథ్యంలో  లక్ష జనహారతి
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లాలో వైభవంగా సాగునీటి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లాలో వైభవంగా సాగునీటి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి జగదీష్‌రెడ్డి సారథ్యంలో వేడుకలు జరుగుతున్నాయి. జిల్లాకు కాళేశ్వరం జలాలు ఇచ్చినందుకు కృతజ్ఞతగా లక్ష జనహారతి నిర్వహిస్తున్నారు. నాగారం మండలం ఏటూరు నుంచి.. పెన్‌ పహడ్ మండలం రావి చెరువు వరకు లక్షమందితో లక్ష జనహారతి కార్యక్రమం చేపట్టారు.

68కి.మీ.ల మేర దారిపొడవునా కాలువల వెంట కాళేశ్వరం జలాలకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఊరూవాడ బతుకమ్మ, బోనాలు, మంగళ వాయిద్యాలతో పండుగ వాతావరణం నెలకొంది. 7మండలాలకు చెందిన 126గ్రామాల ప్రజలు ఈ లక్ష జనహారతిలో పాల్గొన్నారు. ప్రతీ పావుకిలోమీటరకు ఒకరు చొప్పున 280మంది ప్రత్యేక అధికారుల బృందం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తోంది.

Tags

Next Story