TG: నేడు సుప్రీంకోర్టులో అనర్హత పిటిషన్ల విచారణ

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేపుతున్న పార్టీ ఫిరాయింపుల వ్యవహారం దేశ సర్వోన్నత న్యాయస్థానం గడపకు చేరింది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్లను నేడు సుప్రీంకోర్టు విచారించనుంది. కొంతకాలంగా సాగుతున్న ఈ రాజకీయ న్యాయపోరాటం ఇప్పుడు కీలక దశకు చేరుకోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ల వ్యవహారం రేపు సుప్రీంకోర్టు ముందుకు రానుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ సహా బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గతంలో ఈ ఫిటిషన్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదంటూ వారు ధర్మాసనాన్ని ఆశ్రయించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ పిటిషన్లపై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరపనుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని నెలలుగా చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని స్పీకర్ తన నిర్ణయంలో పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు పెద్ద ఊరట లభించగా, పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినట్లైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 2024లో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు తరువాత కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం పెద్ద రాజకీయ చర్చకు దారి తీసింది. ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై బీఆర్ఎస్ నాయకులు అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే బీజేపీ తరఫున కూడా ఈ అంశంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మొత్తం పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ అంశంపై విచారణ చేపట్టారు.
బుధవారం నిర్వహించిన విచారణలో దానం నాగేందర్, కడియం శ్రీహరి తమ వాంగ్మూలాలను సమర్పించారు. తాము ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ సభ్యులుగానే ఉన్నామని, పార్టీని అధికారికంగా విడిచిపెట్టలేదని వారు స్పష్టం చేశారు. తాము కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఎలాంటి ప్రకటన చేయలేదని కూడా తెలిపారు. విచారణ సందర్భంగా దానం నాగేందర్ కొన్ని ముఖ్యమైన అంశాలను స్పష్టంచేశారు. కడియం శ్రీహరి కూడా ఇదే తరహాలో తన వాదనలు వినిపించారు. తాము ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని, అధికారికంగా కాంగ్రెస్‌లో చేరినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి తమకు ఎలాంటి విప్ జారీ కాలేదని కూడా వారు స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ వాంగ్మూలాలను స్పీకర్ పరిశీలించిన తరువాత ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు నిర్ధారించే ఆధారాలు లేవని తేల్చారు. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దానం నాగేందర్, కడియం శ్రీహరి పై దాఖలైన అనర్హత పిటిషన్లను తిరస్కరించారు. వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగించాలనే నిర్ణయం ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు రాజకీయంగా ఊరట లభించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
