Telangana DSC: టీచర్‌ పోస్టుల భర్తీకి మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్‌

Telangana DSC: టీచర్‌ పోస్టుల భర్తీకి మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్‌
X

టీచర్‌ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. 6,500కు పైగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందులో పాఠశాల విద్యలో 5,089, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూళ్లలో 1,523 పోస్టులు ఉన్నట్లు చెప్పారు. ఈసారి టీఎస్‌పీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ ద్వారానే పోస్టుల భర్తీ చేపట్టనున్నట్టు మంత్రి తెలిపారు. రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదలతో పాటు విధి విధానాలు విడుదల చేస్తామన్నారు.

తెలంగాణలో వరుస ఉద్యోగాల నోటిఫికేషన్లతో నిరుద్యోగుల్లో ఆనందం వెల్లివెరుస్తోంది. టీఎస్‌పీఎస్‌సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, ఇతర బోర్డులు వేలాది సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. పలు ఉద్యోగాలకు పరీక్షలు పూర్తయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. సెప్టెంబరు 15వ తేదీన పరీక్షను నిర్వహించనున్నారు. తాజాగా టెట్‌లో క్యాలిఫై అయ్యే అభ్యర్థులకు కూడా డీఎస్సీలో అవకాశం కల్పించనున్నారు. కార్పొరేట్‌ పాఠశాలల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరించారు. నియామకాల విషయంలో ఇప్పటికే భారీ సంఖ్యలో నోటిఫికేషన్లు ఇచ్చినట్టు ఆమె చెప్పారు.

Tags

Next Story