తెలంగాణాలో ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైన అనుమతి లేదు

తెలంగాణా ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష ప్రారంభమైంది. ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించమని ఎంసెట్ కమిటీ స్పష్టం చేయడంతో.. విద్యార్థులు ఉరుకులుపరుగులుపై పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. తెలంగాణాలో 79, ఏపీలో 23 చొప్పున మొత్తం 20 టెస్టు జోన్లలో 102 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల్లో ప్రతిరోజు రెండు విడుతలుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సారి ఎంసెట్ పరీక్షలకు ఒక లక్షా 43 వేల 165 మంది విద్యార్ధులు హాజరవుతున్నారు.
కరోనా నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో అడుగడుగునా శానిటైజేషన్ చర్యలు చేపట్టామని, విద్యార్థులు భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు తమకు కరోనా లేదని సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం సమర్పించాల్సి ఉంటుంది. అయితే కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి మాత్రం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 28, 29 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్ నిర్వహించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com